ఆర్మీ లో ఉద్యోగ అవకాశాలు.. పూర్తి వివరాలు ఇవే..
ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు..
సివిల్/బిల్డింగ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, మెకానికల్, ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ తదితర విభగాల్లొ ఉన్న ఉద్యొగాలను భర్తీ చేయనున్నారు..
అర్హతలు:ఎస్ఎస్సీ (టెక్) మెన్/ఉమెన్సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత. ఎస్ఎస్సీ విడోస్ (నాన్ టెక్నికల్),
(నాన్ యూపీఎస్సీ) పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్ఎస్సీ (విడో) టెక్నికల్- బీఈ/బీటెక్ ఉత్తీర్ణత సాధించాలి.వయస్సు: ఎస్ఎస్సీ (టెక్) మెన్/ఉమెన్2021, అక్టోబర్ 1 నాటికి 2027 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్ఎస్సీ విడోస్ (నాన్ టెక్నికల్), (నాన్ యూపీఎస్సీ), ఎస్ఎస్సీ (విడో) టెక్నికల్ పోస్టులకు 2021, అక్టోబర్ 1 నాటికి 35 ఏండ్లలోపు ఉండాలి.ఎంపిక: ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా చేస్తారు.
ఎంపికలో మొదట బీఈ/బీటెక్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు.
ఎంపిక కేంద్రాల్లో ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు.ఇంటర్వ్యూ కేంద్రాలు: అలహాబాద్, భోపాల్, బెంగళూరు..ఇకపోతే సైకాలజిస్ట్, గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్, ఇంటర్వ్యూ ఆఫీసర్లు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
రెండు దశల్లో ఐదురోజులుపాటు వీటిని నిర్వహిస్తారు.
మొదటి రోజు నిర్వహించిన పరీక్షల్లో అర్హత సాధించినవారికే తర్వాతి నాలుగురోజుల్లో పరీక్షలకు అనుమతిస్తారు.ఈ ఇంటర్వ్యూల్లో అర్హత సాధించినవారికి వైద్యపరీక్షలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.. ఆ తర్వాత ఉద్యొగాలకు సరి పోతే శిక్షణ ఇస్తారు..
ఇంటర్వ్యూలో విజయవంతమైనవారికి చెన్నైలోని ఆఫీసర్ ట్రెయినింగ్ అకాడమీలో శిక్షణ ఇస్తారు.
శిక్షణ కాలవ్యవధి 49 వారాలు.
ఈ శిక్షణ సమయంలో నెలకు రూ.56,100/- స్టయిఫండ్‌గా చెల్లిస్తారు.
శిక్షణ పూర్తి చేసుకున్న వారికి లెఫ్టినెంట్ హోదాలో ఉద్యోగాన్ని ఇస్తారు. రెండేండ్ల అనుభవం తర్వాత కెప్టన్, తర్వాత మేజర్, లెఫ్టినెంట్ కల్నల్ వరకు పదోన్నతులు ఉంటాయి.ఒక్కో పదవుల్లో ఉన్న వారికి ఒక్కో జీతం ఉంటుంది.. రూ.56,100/ ఇస్తారు. దీనికి అదనంగా డీఏ ఇతర అలవెన్స్‌లు ఇస్తారు.అన్నీ కలిపి లక్ష వరకు ఉంటుంది.. ఈ ఉద్యొగాల పై ఆసక్తి కలిగిన వాళ్ళు https://ail.ac.in పూర్తి వివరాలు చూడవచ్చు..