
రైల్వేలో 3591 ఉద్యోగాలు... నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ..
ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి 2021 జూన్ 24 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్ ద్వారా వెల్డర్, కార్పెంటర్, పెయింటర్, ఎలక్ట్రీషియన్, డ్రాఫ్ట్స్‌మ్యాన్, డీజిల్ మెకానిక్, ఎలక్ట్రానిక్ మెకానిక్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది పశ్చిమ రైల్వే. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను పశ్చిమ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ అధికారిక వెబ్‌సైట్ https://www.rrc-wr.com/ లో పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
ఉద్యోగాల పూర్తి వివరాలు ఇవే..
మొత్తం ఖాళీలు- 3591
డివిజన్- 738
వడోదరా డివిజన్- 489
అహ్మదాబాద్ డివిజన్- 611
రాత్లాం డివిజన్- 434
రాజ్‌కోట్ డివిజన్- 176
భావ్‌నగర్ వర్క్‌షాప్- 210
లోయర్ పరేల్ వర్క్‌షాప్- 396
మహాలక్ష్మి వర్క్‌షాప్- 64
భావ్‌నగర్ వర్క్‌షాప్- 73
దహోద్ వర్క్‌షాప్- 187
ప్రతాప్‌నగర్ వర్క్‌షాప్ వడోదర- 45
సబర్మతీ ఇంజనీరింగ్ వర్క్‌షాప్ అహ్మదాబాద్- 60
సబర్మతీ సిగ్నల్ వర్క్‌షాప్ అహ్మదాబాద్- 25
హెడ్‌క్వార్టర్ ఆఫీస్-34
ఇకపోతే ఉద్యోగాల పూర్తి వివరాలు
దరఖాస్తు ప్రారంభం- 2021 మే 25 ఉదయం 11 గంటలు
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 జూన్ 24 సాయంత్రం 5 గంటలు
విద్యార్హతలు- టెన్త్ క్లాస్ 50 శాతం మార్కులతో పాస్ కావాలి. సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి.
వయస్సు- 15 నుంచి 24 ఏళ్ల లోపు ఉండాలి
దరఖాస్తు ఫీజు- రూ.100
ఈ ఉద్యోగాల పై ఆసక్తి కలిగిన వాళ్ళు నోటిఫికేషన్ లో పూర్తి వివరాలు చదివి అప్లై చేసుకోవాలి..