డిజాస్టర్ మూవీ కోసం ఏకంగా బ్లాక్‌బస్టర్ మూవీనే రిజెక్ట్ చేసిన స్టార్ బ్యూటీ..?

frame డిజాస్టర్ మూవీ కోసం ఏకంగా బ్లాక్‌బస్టర్ మూవీనే రిజెక్ట్ చేసిన స్టార్ బ్యూటీ..?

Pulgam Srinivas
సినిమా ఇండస్ట్రీ లో కొంత మంది ఒక సినిమాకు కమిట్ అయి ఉండడం వల్ల మరొక సినిమాను వదులుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. అలా వారు నటించిన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టి వారు వదులుకున్న సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించినట్లయితే ఆ రోజు ఆ సినిమాను ఎందుకు వదులుకున్నామా అని బాధపడే వారు కూడా ఉంటారు. ఇకపోతే తమిళ్ , తెలుగు ఇండస్ట్రీలలో అద్భుతమైన క్రేజ్ కలిగిన ఓ నటీమణి కొంత కాలం క్రితం ఓ హిందీ సినిమాలో నటించింది. ఇక అదే సమయంలో ఆమెకు మరో హిందీ సినిమాలో కూడా ఆఫర్ వచ్చిందట. కానీ మొదట ఓకే చేసిన సినిమా చేయడం కోసం రెండవ సినిమాను రిజెక్ట్ చేసిందట. ఇక మొదట ఆ ముద్దు గుమ్మ ఓకే చేసిన సినిమా బాక్సా ఫీస్ దగ్గర ఫ్లాప్ కాగా ... ఆమె రిజెక్ట్ చేసిన మూవీ మాత్రం భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకు ఆ సినిమా ఏది ..? ఆ మూవీ ని వదులుకున్న ముద్దు గుమ్మ ఎవరో తెలుసుకుందాం.

తమిళ్ , తెలుగు ఇండస్ట్రీలలో అద్భుతమైన క్రేజ్ కలిగిన నటిమానులలో ఒకరు అయినటువంటి కీర్తి సురేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె కొంత కాలం క్రితం బేబీ జాన్ అనే హిందీ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీతోనే ఈమె హిందీ సినీ పరిశ్రమకు పరిచయం అయింది. ఈ సినిమాకి ఓకే చెప్పిన తర్వాత ఈమెకు ఛావా మూవీ లో హీరోయిన్గా అవకాశం వచ్చిందట. కానీ ఈమె బేబీ జాన్ మూవీని ఓకే చేయడంతో ఛావా మూవీ ని రిజెక్ట్ చేసిందట. ఇక బేబీ జాన్ సినిమా ఫ్లాప్ కాగా , ఛావా మూవీ మాత్రం భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఛావా మూవీ లో రష్మిక మందన హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ద్వారా రష్మీక కి హిందీలో మంచి గుర్తింపు వచ్చింది. అలా కీర్తి సురేష్ ఫ్లాప్ మూవీ ని ఎంచుకొని బ్లాక్ బస్టర్ మూవీ ని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: