మహిళ పాలిటెక్నిక్‌ విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..

Satvika
తెలంగాణ సర్కార్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది.సిద్దిపేట పట్టణ శివారులోని పెద్దకోడూరు పాలిటెక్నిక్‌ మహిళా కాలేజీలో కొత్త కోర్సు మంజూరు చేస్తూ సాంకేతిక విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఎలక్ట్రికల్, సివిల్‌ ఇంజనీరింగ్‌ కోర్సులు ఉండగా.. తాజాగా డిప్లోమా ఇన్‌ కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ కోర్సు మంజూరైంది. 60 మంది విద్యార్థినులకు సీట్లు కేటాయించారు. తెలంగాణ రాష్ట్రంలో కంప్యూటర్‌ కోర్సు మొదటగా సికింద్రాబాద్‌ మహిళా పాలిటెక్నిక్‌ కాలేజీలో ఉండగా.. రెండోది పెద్దకోడూరు మహిళా పాలిటెక్నిక్‌ కాలేజీ కావడం సిద్దిపేటలో ఉంది.

ఈ కాలేజీలో ఈ ఏడాది నుంచే కాలేజీలో కొత్త కోర్సులు ప్రారంభం కానున్నాయి..పాలీసెట్‌ ప్రవేశ పరీక్షలో ప్రతిభ చూపిన అమ్మాయిలకు ఇక్కడ ఉచిత కంప్యూటర్‌ విద్యను అందించారు.మూడేళ్ల పరిమితి కలిగిన ఈ కోర్సు పూర్తయ్యాక ఇంజనీరింగ్‌ కాలేజీలో చేరాల్సి ఉంటుంది. ఇప్పటివరకు పెద్ద కోడూరు మహిళా పాలిటెక్నిక్‌ కాలేజీలోని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌ కోర్సులో 180 మంది, సివిల్‌ ఇంజనీరింగ్‌ కోర్సులో 180 మంది అమ్మాయిలు చదువుతున్నారు. కొత్త గా పెట్టిన కోర్సులో 60 మంది చేరుతారని అంచనా వేస్తున్నారు.

సిద్దిపేట ప్రాంతం ఒక విద్యాక్షేత్రంగా విలసిల్లడం గర్వంగా ఉందని.. ఇప్పటికే సిద్దిపేట పట్టణ చుట్టూరా 4 పాలిటెక్నిక్‌ కాలేజీలు ఉన్నాయని మంత్రి తెలిపారు. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ, ఓ ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీ, పీజీ కాలేజీ, అటానమస్‌ డిగ్రీ కళాశాల తో పాటు మహిళా డిగ్రీ కళాశాలలు అందుబాటు లో ఉన్నాయి. ఇటీవలే సిద్దిపేట ప్రాంతం లో ఐటీ టవర్‌ కు భూమిపూజ జరిగింది. త్వరలోనే సాఫ్ట్‌వేర్‌ రంగం అభివృద్ధి చెందుతుంది. అందుకోసమే పెద్దకోడూరు పాలిటెక్నిక్‌ కళాశాలలో కొత్తగా కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ కోర్సు మంజూరు కావడం హర్షించదగిన విషయం. కొత్త కోర్సు నిర్వహణకు కావాల్సిన సౌకర్యాలు, సిబ్బందిని వెంటనే ఏర్పాటు చేయిస్తామని మంత్రి హరీష్ రావు అన్నారు.ఇది నిజంగానే గుడ్ న్యూస్ అనే చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: