GIC ప్రభుత్వ సంస్థ లో జాబ్స్..? సెలెక్ట్ అయిన వారికి వేతనం రూ.65,000..!

Divya

నిరుద్యోగులకు ఒక శుభవార్త తెలిపింది భారత ప్రభుత్వం. జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా -GIC ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అసిస్టెంట్ మేనేజర్ స్కేల్ 1 భర్తీ చేస్తోంది. మొత్తం 44 పోస్టులు ఖాళీలున్నాయి . ఫైనాన్స్,జనరల్, లీగల్, ఇన్సూరెన్స్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. సంబంధిత సబ్జెక్టులలో గ్రాడ్యుయేషన్,పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారు దరఖాస్తులు చేసుకోవచ్చు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు మార్చ్ 29 -2021 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలను  https://www.gicofindia.com/ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునేందుకు అప్లికేషన్ పూర్తిగా చదివి, విద్యార్థులు తెలుసుకోవాలి. అభ్యర్థులు ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి ముంబైలో పోస్టింగ్ ఉంటుంది.

GIC ఖాళీల వివరాలివే..
మొత్తం ఖాళీలు-44
ఫైనాన్స్ -15
జనరల్ -15
లీగల్ -4
ఇన్సూరెన్స్ -10
దరఖాస్తు ప్రారంభం - మార్చి 11 -2021
దరఖాస్తుకు చివరి తేదీ - మార్చి 29 - 2021
దరఖాస్తు ఫీజు చెల్లింపు-2021 మార్చి 11 నుంచి మార్చి 29 వరకు.
ఆన్లైన్ ఫ్రీ రిక్రూమెంట్ ట్రైనింగ్ సెక్షన్-2021 ఏప్రిల్ 26 నుంచి 29
అడ్మిట్ కార్డ్ విడుదల - పరీక్షలకు పది రోజులు ముందుగా
ఆన్లైన్ ఎగ్జామ్స్-2021 మే 9
ఫలితాల వెల్లడి - తేదీని  త్వరలో వెల్లడించనున్నారు జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్
విద్యార్హతలు:
సంబంధిత సబ్జెక్టులలో డిగ్రీ పూర్తి చేసిన లేదా పోస్టు గ్రాడ్యుయేషన్ పాస్ కావాలి.
వయస్సు :
2021 ఫిబ్రవరి 1 నాటికి 21 ఏళ్ల నుంచి 30 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ళు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ళు, దివ్యాంగులకు 10 ఏళ్ళు వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు రూ.32,795 బేసిక్ తో పాటు డి ఎ, హెచ్ఆర్ఏ లాంటి అలవెన్సులు ఉంటాయి. మొత్తం  రూ.65,000 వరకు వేతనం లభించనుంది.
పరీక్ష కేంద్రాలు :
ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, రాజమండ్రి, తెలంగాణలోని హైదరాబాద్,కరీంనగర్

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: