ఏపి నిరుద్యోగులకు శుభవార్త.. ప్రముఖ సంస్థలో 200 ఉద్యోగాలు..

Satvika
ఏపి సర్కార్ ప్రజల సంక్షేమం కోసం కొత్త పథకాలను అమలు చేస్తూ వస్తుంది. వైసీపీ అధికారం లోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు ఎన్నో పథకాలను అమల్లోకి తీసుకొచ్చారు. కాగా, ఇప్పుడు ఇంటింటికీ రేషన్ సరుకులు డెలివరీ పథకం ను కూడా తీసుకువచ్చారు. ఇప్పుడు నిరుద్యోగులు సమస్యను అధిగమించేందుకు కొత్త పథకాల ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఏపీ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ తాజాగా మరో శుభవార్త చెప్పింది. గుంటూరు, సీఆర్డీఏ రీజియన్, కృష్ణా జిల్లాల్లోని రిలయన్స్ రిటైల్ లో ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.



ఈ ప్రకటన ద్వారా మొత్తం 200 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ నెల 7ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా రిజిస్టర్ చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులు గుంటూరు, కృష్ణా జిల్లా లతో పాటు సీఆర్డీఏ రీజియన్లలో పని చేయాల్సి ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాల ద్వారా కొంత వరకు నిరుద్యోగ సమస్య తీరుతుందని చెప్పుకొచ్చారు



కామర్స్ సేల్స్ ఆఫీసర్ విభాగంలో ఈ 200 పోస్టులను భర్తీ చేస్తున్నారు..ఈ పోస్టులకు పెద్దగా చదువు అవసరం లేదు. కేవలం ఇంటర్ లో అర్హత సాధించి ఉండాలని అధికారులు వెల్లడించారు.ఆ పైన విద్యార్హతలు కలిగిన వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు దారుల వయస్సు 22-30 ఏళ్లు ఉండాలి. పురుషులు, స్త్రీలు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులకు 2 వీలర్ తో పాటు, స్మార్ట్ ఫోన్ ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 13, 500 వేతనంతో పాటు పని తీరు ఆధారంగా రూ. 6 వేల వరకు ఇన్సెంటీవ్స్ ఇస్తారు.ఆసక్తి కలిగిన అభ్యర్థులు పైన ఇచ్చిన లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: