మే 3 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం..

Satvika
ఇంటర్ ప్రథమ , ద్వితీయ సంవత్సరం పరీక్షలు మే నెల 3 నుంచి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ప్రధాన సబ్జెక్టుల పరీక్షలు ఆ నెల 19వ తేదీతో, అన్ని పరీక్షల్ని 24వ తేదీతో పూర్తిచేయాలని ఇంటర్‌ బోర్డు భావిస్తోంది. ఈమేరకు అధికారులు కాలపట్టిక రూపొందిస్తున్నట్లు తెలిసింది. ఏప్రిల్‌ నెలాఖరులో పరీక్షలు ప్రారంభించి మే రెండో వారానికి పూర్తి చేయాలని గతంలో ప్రాథమికంగా నిర్ణయించారు. అయితే ఏప్రిల్‌ 27 నుంచి 30 వరకు జేఈఈ మెయిన్‌ మూడో విడత పరీక్షలు.. మే 24 నుంచి చివరి విడత జేఈఈ మెయిన్‌ ఉన్నందున ఇంటర్‌ పరీక్షలను మే 3న ప్రారంభించి 24వ తేదీకి పూర్తి చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. 



వచ్చే నెల పిభ్రవరి 1 నుంచి ఏప్రిల్ వరకు మాత్రమే తరగతులను పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. ఫిబ్రవరి, మార్చిలో 24 రోజుల చొప్పున, ఏప్రిల్‌లో 20 రోజులు కలిపి మొత్తం 68 రోజులు తరగతులు జరుగుతాయి. అయితే షిఫ్టు విధానం కాకుండా ఒక రోజు ప్రథమ సంవత్సరం, మరుసటి రోజు రెండో సంవత్సరం విద్యార్థులకు తరగతులు జరపాలని తాజాగా ప్రభుత్వం సూచించింది. ఇది అమలైతే ఒక్కో ఏడాది విద్యార్థులకు 34 రోజులు మాత్రమే ప్రత్యక్ష క్లాసులు జరుగుతాయి. అప్పుడు మాత్రమే క్లాసులను పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే రెండు పేపర్లు ఉన్న పరీక్షా ఫలితాలను ఒక పేపర్ కు కుదించిన విషయం తెలిసిందే..



ఎంసెట్ పరీక్షలను కూడా జేఈఈ మెయిన్ సిలబస్ లాగానే మొత్తం పరిగణ లోకి తీసుకొని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో తప్పిన 1.92 లక్షల మంది విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించే అవకాశం లేదని, కనీస మార్కులు ఇచ్చి ఉత్తీర్ణులను చేసేదిశగా ప్రతిపాదనలు తయారు చేస్తున్నట్లు తెలిసింది. ఎక్కువ మార్కులు రావాలనుకునేవారు మే లో జరగనున్న పరీక్షలు రాసుకోవచ్చునని పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: