పీజీ విద్యార్థులకు తెలంగాణ సర్కార్ తీపి కబురు..

Satvika
తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు తీపి కబురు అందించింది.. వచ్చే ఏడాది విద్యా సంవత్సరం కు సంబంధించిన అకడమిక్ క్యాలెండర్ ను రాష్ట్ర విద్యా శాఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే.. ఈ మేరకు తరగతులను కూడా ప్రారంభించారు. ఇప్పటికే గత ఏడాది వాయిదా పడిన ప్రవేశ పరీక్షలను గత నెల నుంచి జరిపిస్తున్నారు. కొన్ని పరీక్షా ఫలితాలు మాత్రం విడుదల చేయగా , మరి కొన్ని కౌన్సిలింగ్ ను కూడా పూర్తి చేసుకున్నాయి. కొత్త సంవత్సరం తరగతులు కూడా దాదాపు పూర్తి అయ్యాయి. 



ఇది ఇలా ఉండగా.. ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్ ను మరింత మెరుగు పరచడానికి కొత్త నిర్ణయాన్ని తీసుకుంది. ప్రతి ఏటా రాష్ట్రం లో ఉత్తీర్ణత సాధిస్తున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. కానీ, ఉద్యోగుల సంఖ్య మాత్రం ఓ మాదిరిగా ఉంది. అలాంటి సమస్య నుంచి విద్యార్థులను బయట పడేయడానికి ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీ తో డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే.. ఇంజనీరింగ్, డిగ్రీ, పాలిటెక్నిక్ విద్యార్థులకు సాంకేతిక, వృత్తి పరమైన నైపుణ్యాల ను పెంపొందించేందుకు ఆన్b‌లైన్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వాలని భావిస్తోంది.



ఈ మేరకు మల్టీ నేషనల్ కంపెనీ ఐబీఎం తో చేతులు కలిపింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 30 వేల మంది బీటెక్, డిగ్రీ, పాలిటెక్నిక్ స్టూడెంట్స్‌కు ఉచితంగా టెక్నికల్ కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు ఐబీఎం, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ మద్య కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది..సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చెయిన్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, క్లౌడ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లాంటి ఉచితంగా నేర్పించనున్నట్లు వెల్లడించింది.. ఇక పోతే ఈ ఒప్పందం ద్వారా తెలంగాణ లో చాలా వరకు నిరుద్యోగ సమస్య తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.. ఈ నిర్ణయం పై తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: