ఈ నెల 15 వ తేదీ లోపు అమ్మఒడి వివరాల నమోదు..
ఇకపోతే ఇది కాకుండా అమ్మ ఒడి పథకాన్ని కూడా ప్రారంభించారు.. ఈ పథకం లో భాగంగా విద్యార్థులకు స్కాలర్ షిప్ లా డబ్బులను అందిస్తున్నారు. గత ఏడాది లో అమలు లోకి వచ్చిన ఈ పథకం ద్వారా ఒకసారి డబ్బులు వేశారు. ఇకపోతే ఇప్పుడు అమ్మఒడి పథకం 2020- 21 సంవత్సరం కొనసాగింపు లో భాగంగా జిల్లా లోని అన్ని యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలల ఛైల్డ్ ఇన్‌ఫో అంతర్జాలం లో నమోదు చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి శైలజ తెలిపారు.
ఈ నెల 15వ తేదీ లోగా ఈ పథకానికి సంబంధించిన అన్నీటిని పూర్తి చేయనున్నారు. జగనన్న అమ్మఒడి పథకం ద్వారా 2021 జనవరి 9వ తేదీన రూ.15వేలు అందాలంటే పీఎస్, యూపీఎస్, హెచ్‌ఎస్ ప్రధానోపాధ్యాయులందరూ తప్పనిసరిగా విద్యార్థులందరి వివరాలను ఛైల్డ్ ఇన్‌ఫోలో ఉండేటట్లు చూడాలని పేర్కొన్నారు. ఈ నెల 15వ తేదీ రాత్రి 12 గంటల లోగా ఛైల్డ్ ఇన్‌ఫో అప్‌డేట్ చేయాలని, ఆ తరువాత వెబ్‌సైట్ క్లోజ్ చేస్తారని వెల్లడించారు.. ఛైల్డ్ ఇన్‌ఫో, జ్ఞానభూమి పోర్టల్ లో నమోదయిన విద్యార్థులనుబట్టి అర్హులైన తల్లుల, సంరక్షకుల జాబితాను ఆరు అంచెల ప్రమాణం ప్రకారం పూర్తిగా పరిశీలించి 16న జాబితాను విడుదల చేస్తున్నట్లు సమాచారం.. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మాత్రమే ఈ పథకం ద్వారా లబ్ది చేకూరుతుందని వార్తలు వినిపిస్తున్నాయి..