మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నైనిటాల్ బ్యాంక్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీగా ఉన్న పోస్టు వివరాలు, అర్హత, దరఖాస్తు విధానం తదితర అంశాల గురించి వెల్లడించింది. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ వచ్చే నెల 23వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని బ్యాంకు వెల్లడించారు. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు. లేదా మార్కెటింగ్ అండ్ సేల్స్ స్పెషలైజేషన్ తో డిగ్రీ లేదా పీజీ చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. హిందీ, ఇంగ్లీష్ మీద పట్టు ఉండి.. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి.
ఈ నోటిషికేషన్ ద్వారా 15 పోస్టులను బ్యాంక్ భర్తీ చేయనుంది. సెప్టెంబర్ 30 తేదీ నాటికి 20 నుంచి 30 ఏళ్లలోపు వారు ఈ పోస్టుకి అర్హులు. దరఖాస్తుకి సంబంధించి సంబంధిత ధ్రువపత్రాలను ఆన్ లైన్ అప్ లోడ్ చేయాలి. పూర్తి వివరాలకు వెబ్ సైట్ : nainitalbank.co.in కు లాగిన్ అవ్వండి.
మరింత సమాచారం తెలుసుకోండి: