ఫారెస్ట్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ లో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల...!

Kothuru Ram Kumar
డెహ్రాడూన్ లో ఉన్న ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసర్చ్ అండ్ ఎడ్యుకేషన్, ఉత్తరాఖండ్ లోని ఫారెస్ట్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ లో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ పరంగా మొత్తం 107 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. గత రెండు సంవత్సరాల క్రితం రిక్రూట్మెంట్ చేసుకున్న ఫారెస్ట్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ మళ్లీ ఇప్పుడే నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఇక ఈ నోటిఫికేషన్ పరంగా ఉద్యోగ వివరాలు చూస్తే... మల్టీ టాస్కింగ్ స్టాఫ్, టెక్నికల్ అసిస్టెంట్, లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ మరికొన్ని పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇకపోతే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఇదివరకే ఆన్లైన్ ప్రక్రియ మొదలై పోయింది. అప్లై చేసుకోవడానికి సెప్టెంబర్ 15 2020 చివరి తేదీ.
ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలను  https://frirecruitment.icfre.gov.in, https://fri.icfre.gov.in వెబ్ సైట్స్ లో చూడవచ్చు. ఇక ఈ నోటిఫికేషన్ ద్వారా విడుదల చేసిన 107 పోస్టుల పూర్తి వివరాలు ఒకసారి చూస్తే... టెక్నికల్ అసిస్టెంట్ (ఫీల్డ్ / ల్యాబ్ రీసెర్చ్) - 59, మల్టీ టాస్కింగ్ స్టాఫ్- 40, టెక్నికల్ అసిస్టెంట్ (మెయింటనెన్స్)- 3, స్టెనో గ్రేడ్ 2 - 4  లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్- 1 లా ఉన్నాయి. ఇందుకు సంబంధించి జీతాల వివరాలు కూడా పోస్టులు బట్టి విరివిరిగా లభించనున్నాయి. ఎవరైతే ఉద్యోగాలకు అప్లై చేయాలనుకొన్నారో వారు విద్యార్హతలకు సంబంధించి సరైన వివరాలు పొందుపరిచి అప్లై చేసుకోవాలి.

ఈ ఉద్యోగాలకు విద్యార్హతలు పోస్ట్ కు సంబంధించి వేరువేరుగా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం నోటిఫికేషన్ ని పూర్తిగా అధ్యయనం చేయండి. ఇక ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాల్సిన వారు జనరల్, బిసి వారికి దరఖాస్తు ఫీజు రూ. 700 గా నిర్ణయించగా... మహిళలు, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ. 300 గా నిర్ణయించారు. కాబట్టి ఈ పోస్టులకు ఎవరైతే అర్హులో వారు వెంటనే అప్లై చేసుకుని ఉద్యోగాన్ని సంపాదించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: