బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. అస్సలు మిస్ అవ్వకండి!!
ఈ నోటిఫికేషన్‌లో 28 ఖాళీలు ఉన్నాయి. అయితే స్పోర్ట్స్ పర్సన్స్ మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఇందులో క్లర్క్ పోస్టులు 14, జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ పోస్టులు 14 ఉన్నాయి. వీటి పూర్తి వివరాలు చూస్తే.. ఆర్చరీ: క్లర్క్- 2, ఆఫీసర్ 2, అథ్లెటిక్స్: క్లర్క్- 2, ఆఫీసర్ 2, బాక్సింగ్: క్లర్క్- 2, ఆఫీసర్ 2, జిమ్నాస్టిక్: క్లర్క్- 2, స్విమ్మింగ్: క్లర్క్- 2, ఆఫీసర్ 2, టేబుల్ టెన్నిస్: ఆఫీసర్ 2, వెయిట్ లిఫ్టింగ్: క్లర్క్- 2, ఆఫీసర్ 2, రెజ్లింగ్: క్లర్క్- 2, ఆఫీసర్ 2 పోస్టులు ఉన్నాయి. విద్యార్హత విషయానికి వస్తే.. క్లర్క్ పోస్టుకు 10వ తరగతి ఉండాలి. ఆఫీసర్ పోస్టుకు బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి.
స్పోర్ట్స్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే.. క్లర్క్ పోస్టుకు స్పోర్టింగ్ ఈవెంట్ / కేటగిరీ డీలో ఛాంపియన్‌షిప్ ఉండాలి. ఆఫీసర్ పోస్టుకు స్పోర్టింగ్ ఈవెంట్ / కేటగిరీ ఏ, బీ, సీలో ఛాంపియన్‌షిప్ ఉండాలి. అలాగే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు.. క్లర్క్ పోస్టుకు 18-25 ఏళ్లు ఉండాలి. ఆఫీసర్ పోస్టుకు 18-25 ఏళ్లు ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే.. జనరల్ అభ్యర్థులు రూ.200 చల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.50 చల్లిస్తే సరిపోతుంది. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం అయింది. దరఖాస్తు చేయడానికి 2020 ఆగస్ట్ 16 చివరి తేదీగా బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్‌లో పేర్కొంది. కాగా, ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://bankofindia.co.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు.