వై.ఎస్. ఎప్పుడు మరణించారు ? ఆయన పథకాలేంటి..?

పోటీ పరీక్షలు రాసేవారికి.. జనరల్ స్టడీస్, కరెంట్ ఎఫయిర్స్ కీలకమైన అంశాలు।. జనరల్ నాలెడ్డ్ కోటాలో ఏమైనా ప్రశ్నలు అడగొచ్చు. వీటికి నిర్షిష్టమై సిలబస్ అంటూ ఏదీ ఉండదు. అందుకోసమే పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యేవారు వార్తా పత్రికలను రెగ్యులర్ గా ఫాలో అవుతూ నోట్సు రాసుకోవాల్సి ఉంటుంది.


తాజాగా జరిగిన ఏపీ గ్రూపు-2 ప్రధాన పరీక్షల అభ్యర్థులకు ఇలాంటి ప్రశ్నలు బాగానే ఎదురయ్యాయి. వైఎస్ జగన్ సీఎంగా ఉన్ననేపథ్యంలో.. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చనిపోయిన తేదీ ఏది? అనే ప్రశ్న కూడా గ్రూప్ 2లో రావడం విశేషం. అంతే కాదు.. రాష్ట్ర రాజధానికి ఇప్పటివరకు కేంద్రం నుంచి వచ్చిన నిధులెన్ని ? అనే ప్రశ్న కూడా కనిపించింది.


దివంగత నేత వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొనసాగిన పథకాలపైనా ప్రశ్నలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఎంతమంది జనాభాకు ఒక చౌక దుకాణం ఉంది? ఏపీలో పురపాలక సంఘాలు, ఫార్మాసెజ్‌ల సంఖ్య.. ఎంత.. ? 2018లో జీఎస్‌డీపీలో రాష్ట్ర ర్యాంకు ఎంత?.. ఇలాంటి అనేక ప్రశ్నలు ప్రశ్నాపత్రంలో దర్శనమిచ్చాయట.


గ్రూప్‌-2 స్థాయికి తగినట్లు ప్రశ్నలు లేవని.. మైనస్ మార్కులున్నా 150కి 130కిపైగా ప్రశ్నలకు సమాధానాలను అందరూ గుర్తించేలా ప్రశ్నపత్రం ఉందని సీనియర్లు చెబుతున్నారు. ఎకానమీ పేపర్ కఠినంగా ఉందని... ఏపీ, ఇండియన్‌ ఎకానమీకి సంబంధించి సమపాళ్లలో ప్రశ్నలు అడగాల్సి ఉండగా ఇండియన్‌ ఎకానమీపైనే ఎక్కువ ప్రశ్నలున్నాయని కొందరు అభిప్రాయపడ్డారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: