"ఎస్వీయూ" యూనివర్సిటీలో..."డ్యుయల్ డిగ్రీ చిచ్చు"

Bhavannarayana Nch

శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ లో ప్రవేసపెట్టిన డ్యుయల్ డిగ్రీ విధానం రెగ్యులర్ విద్యార్ధుల భవిష్యత్తుకి వారి ఎదుగుదలకి కారణం అవుతోందని..డ్యుయల్ డిగ్రీ విద్యార్ధుల వలన రెగ్యులర్‌ విద్యార్థులకు భద్రత లేకపోయిందంటూ రెండు రోజులుగా వర్సిటీ పరిపాలన భవనం ముందు ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన రెగ్యులర్‌ విద్యార్థులు ధర్నా నిర్వహిస్తున్నారు..వెంటనే డ్యూయెల్‌ డిగ్రీ కోర్సును రద్దు చేసి, కేవలం రెగ్యులర్‌ విద్యార్థులకు మాత్రమే యూనివర్సిటీ లో ప్రవేశాలు కలిపించాలని విద్యార్ధులు డిమాండ్ చేస్తున్నారు..

 

అయితే ఈ నిరసనలు మిన్నంటి మీడియా లో హల్చల్ చేయడంతో  మంగళవారం ఉదయం ఉపకులపతి ఆచార్య దామోదరం నేరుగా ధర్నా చేస్తున్న విద్యార్థుల వద్దకు వెళ్లి సమస్యలను ఆరా తీశారు...సమస్యని శాంతియుతంగా పరిష్కరిద్దాం కొందరు విద్యార్ధులు తన కార్యాలయానికి వచ్చి సంప్రదించండని సూచించారు.అయితే ఈ మేరకు విద్యార్ధులు ఆయన  హామీతో సమస్యని విరమించారు..ఉపకులపతి తో భేటీ అయిన విద్యార్ధులు సమస్యలని ఆయనకీ వివరించారు..డ్యూయెల్‌ డిగ్రీ కోర్సులో ప్రవేశాలకు గతంలో వర్సిటీనే ప్రత్యేకంగా ప్రవేశ పరీక్ష నిర్వహించి ప్రవేశాలు కల్పించేది. దీంతో పెద్దగా ప్రతిభ లేని విద్యార్థులు సైతం ప్రవేశాలు పొందుతున్నారన్నది ప్రధాన వాదన.

 

ఈ విషయంలో ఉపకులపతి ఆచార్య దామోదరం డ్యూయెల్‌ డిగ్రీ కోసం ఎస్వీయూ నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్షను రద్దు చేయాలని వెంటనే ఆదేశాలు జారీచేశారు అదే సందర్భంలో ప్రతిభకు ఆయా కోర్సుల్లో గతంలో ఇష్టానుసారంగా కేటాయించిన సీట్ల సంఖ్యను సైతం భారీగా తగ్గించారు. ప్రతిభకు పెద్దపీట వేయాలన్న లక్ష్యంతో ఎంసెట్‌, జేఈఈ ఫలితాల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు మాత్రమే 2018-19 విద్యాసంవత్సరంలో సీట్లను కేటాయించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఈసీఈ-45, సీఎస్సీ-45, సివిల్‌-30, మెకానికల్‌-30, ఎలక్ట్రికల్‌-30 సీట్లకు పరిమితం చేశారు.

 

అయితే ఈ విధానం వలన కేవలం ప్రతిభ ఉన్న డ్యూయెల్‌ డిగ్రీ విద్యార్ధులు మాత్రమే ప్రవేశం పొందుతారని తెలిపారు..ఇదిలాఉంటే ఇంజినీరింగ్‌ కళాశాలలో చోటుచేసుకున్న సంఘటనలు, రెండురోజులుగా జరుగుతున్న ధర్నాల నేపథ్యంలో ఈ ఏడాది డ్యూయెల్‌ డిగ్రీ ప్రవేశాలు జరపాలా..? వద్దా..? అనే విషయంపై రెగ్యులర్‌ విద్యార్థులతో వీసీ జరిపిన చర్చల్లో సైతం ఉపకులపతి మాట్లాడుతూ..డ్యూయెల్‌ డిగ్రీ నిర్వహణలో నెలకొన్న పలు లోపాలను ఇప్పటికే చక్కదిద్దా. కోర్సును రద్దు చేయాలన్న మీ డిమాండ్‌ను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి మీకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు అయితే ఈ సమస్య గనుకా చక్కబడి  డ్యూయెల్‌ డిగ్రీ ప్రవేశాలు జరిగితే మాత్రం ఈ ఏడాది ఎంసెట్‌, జేఈఈలో ప్రతిభ చాటిన విద్యార్థులే డ్యూయెల్‌ డిగ్రీలో ప్రవేశాలు పొందనున్నారు.

 




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: