విద్యార్థులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి..!

frame విద్యార్థులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి..!

Edari Rama Krishna
ప్రపంచం ఇప్పుడు టెక్నాలజీ పరంగా ఎంతో ముందుకు దూసుకు వెళ్తుంది. ఎన్నో కొత్త వస్తువులు మన కళ్లముందు ఆవిష్కరింప బడుతున్నాయి.  ఇక విద్యారంగంలో కూడా కొత్త కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.  ఒకప్పుడు విద్యార్థులు గురుల వద్ద పాఠాలు నేర్చుకునే సమయంలో వారు చెప్పిన విషయాన్ని తూ..చ.. తప్పకుండా పాటించే వారు.  ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయ్యింది..ముఖ్యంగా కమ్యూనికేషన్ రంగంలో ఎన్నో మార్పులు చేర్పులు వచ్చాయి. 
Image result for students cell phone

ఇప్పుడు ఒక్క స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు ప్రపంచం మొత్తం మన గుప్పిట్లో ఉన్నట్లే లెక్క.  అయితే సెల్ ఫోన్ ప్రభావం ఇప్పుడు విద్యార్థులపై బాగా పడిందనే చెప్పాలి. ఈ నాడు కొంతమది విద్యార్థులు ఎప్పుడు చూసినా సెల్’ఫోన్ చేతిలో పట్టుకొని కాలక్షేపం చేస్తూ కనిపిస్తున్నారు. కొంతమంది అర్థరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా ఫ్రెండ్స్ తో కలిసి తిరుగుతూ ఉంటారు. 
Image result for students cell phone

సెల్ ఫోన్ లో ఇంటర్ నెట్ తో ఎన్నో విజ్ఞానపరమైన అంశాలు తెలుసుకోవచ్చు..కానీ చాలా మంది విద్యార్థులు దాన్ని దుర్వినియోగపరుస్తున్నారి నిపుణులు చెబుతున్నారు.  ఏదైనా నేర్చుకోవాలనుకుంటే దానిపై శ్రద్ధ, ఏకాగ్రత కనబరచాలి. చదువుకొనేటప్పుడు పలు రకాల ఆలోచనలు వస్తాయి. వాటిలో కొన్ని పక్కదారి పట్టించే అవకాశం ఉంది. 

అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు వాటిని పక్కన పెట్టాలి. ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలంటే కొన్ని విషయాల మీది నుండి ధ్యాస మళ్లించుకోవాలి. ఎప్పుడూ సెల్’ఫోన్ చూస్తూ కాలం గడపవలసిన అవసరం ఏముంటుంది. అవసరం ఉన్నవరకే వినియోగించాలి. పరీక్షల ముందు క్రికెట్ కు, సినిమాలకు దూరంగా ఉండాలి. ఒకవేళ మనసు పక్కదారి పడితే జీవితంలో నాకు ఏది ముఖ్యం, నా భవిష్యత్తుకు ఏది అవసరం? అని ప్రశ్నించుకోవాలి


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: