దావోస్‌లో చంద్రబాబు బిజీ బిజీ.. లక్ష్మీ మిట్టల్‌తో కీలక భేటీ?
మంత్రులు నారా లోకేష్ టీజీ భరత్ సమక్షంలో ఈ చర్చలు సాగాయి. అనకాపల్లి జిల్లాలో నిర్మాణం జరగనున్న అర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ పురోగతి గురించి విస్తృతంగా మాట్లాడారు. ఈ ప్రాజెక్టు మొదటి దశలోనే సుమారు 60 వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. ఇది రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చే ముఖ్యమైన అంశమని ఆయన అభిప్రాయపడ్డారు. దావోస్‌లో చంద్రబాబు ఇతర సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. యూఏఈ మంత్రులు కొన్ని కంపెనీల నేతలతో ఆయన చర్చలు జరిపారు. ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడుల హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో ఈ భేటీలు సాగుతున్నాయి.
ఈ సదస్సు రాష్ట్రానికి కొత్త అవకాశాలు తెచ్చేలా ఆయన ప్రయత్నిస్తున్నారు.అనకాపల్లి జిల్లాలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించిన అనుమతులు భూసేకరణ అంశాలపై చంద్రబాబు లక్ష్మీ మిట్టల్ సమక్షంలో అధికారులతో సమీక్షించారు. ఫిబ్రవరి 15లోగా అన్ని అనుమతులు పూర్తి చేయాలని ఆయన అధికారులకు సూచించారు. ఫిబ్రవరి 15 తర్వాత ఈ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు. సాధ్యమైనంత త్వరగా నిర్మాణం పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలని చంద్రబాబు కోరారు.
ప్రభుత్వం నుంచి అనుమతులు సహకారం విషయంలో ఎలాంటి జాప్యం ఉండదని ఆయన స్పష్టం చేశారు. అవసరమైతే ఢిల్లీకి వెళ్లి కేంద్రం నుంచి అన్ని అనుమతులు సాధించాలని మంత్రులు లోకేష్ టీజీ భరత్‌లకు సూచించారు. ఈ ప్లాంట్ నిర్మాణం విషయంలో మంత్రి లోకేష్ నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టు ఆదిత్య మిట్టల్ వ్యాఖ్యానించారు. మొత్తం ప్రాజెక్టు 17.8 మిలియన్ టన్నుల సామర్థ్యంతో 1.4 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు కానుంది.
9490520108.. ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ నియోజకవర్గాల్లో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి. రెండు రాష్ట్రాల్లో నియోజకవర్గాల వారీగా సమస్యలు, ఎమ్మెల్యేల పనితీరు, వారు ఇచ్చిన హామీలు, ప్రజల ఇబ్బందులు, అక్కడ అధికార, ప్రతిపక్ష పార్టీల పరిస్థితులు, రాజకీయ అంశాలపై కూడా మీ అభిప్రాయం మాతో పంచుకోండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.