"శ్రీ” ఆలోచనలలో అక్షరాలు !
ఈగీతం బంకిమ్ చంద్ర చట్టోపాధ్యాయ రచించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మన భారతదేశ నిర్మాణానికి మహా మంత్రంగా ఈనాటి తరానికి స్పూర్తి కలిగించాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఒక సంవత్సరం పాటు జరిగే వేడుకలకు శ్రీకారం చుట్టారు. బంకిమ్ చంద్ర చట్టోపాధ్యాయ బెంగాల్ రాష్ట్రంలోని కంఠలపాడ గ్రామంలో జన్మించారు.
ఆయన ఆంగ్ల విద్యావంతుడు కానీ తన రచనల ద్వారా భారతీయ ఆత్మను ప్రతిబింబించేలా అనేక రచనలు చేశారు. బెంగాల్ సాహిత్యంలో ఆయనను “సాహిత్య సమ్రాట్” అంటారు. ఈయన భారతీయులకు జ్ఞానం భక్తి, శక్తి మూడు సమానంగా ఆరోజులలో అవసరం అనీ ఈ వందేమాతర గీతాన్ని రచించారు.
ఆయన రాసిన ప్రతి రచనలో దేశభక్తి మరియు మాతృభావం కనిపిస్తాయి.
ఆయన నవల “ఆనందమఠం” లో ఈ “వందే మాతరం” కనిస్తుంది. “ఆనందమఠం” నవల కథ నేపథ్యంలో దేశమాతను రక్షించడానికి స్వాతంత్ర సమరయోధులు పోరాడుతారు. ఆ సందర్భంలో, దేశమాతకు నమస్కరిస్తూ వారు పాడే గీతమే “వందే మాతరం”.
సుజలాం సుఫలాం మలయజశీతలాం
శస్యశ్యామలాం మాతరం,
వందే మాతరం! వందే మాతరం అంటూ సాగే ఈగీతంలో ఆధ్యాత్మికంగా భారతమాతను దేవతగా చూపెడుతుంది.
1905లో బ్రిటిష్ ప్రభుత్వం బెంగాల్ విభజన ప్రకటించడంతో దేశవ్యాప్తంగా తీవ్ర అలజడి ఏర్పడి సంరకస్ ఉద్యమాలు జరిగాయి. “వందే మాతరం!” అన్న నినాదం ఆనటి ర్యాలీలలో సమావేశాలలో పాఠశాలల్లో ప్రతిధ్వనించింది.
ఈ నినాదం దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందడంతో బిపిన్ చంద్ర పాల్, లాలా లజపత్ రాయ్, బాల గంగాధర్ తిలక్ ఈ గీతాన్ని జాతీయ ఉద్యమానికి చిహ్నంగా మార్చారు. 1905లో రబీంద్రనాథ్ ఠాగూర్ ఈ గీతాన్ని స్వరపరిచారు.భారతదేశం స్వాతంత్రం పొందిన తరువాత అలానాటి రాజ్యాంగ సభలో రాజ్యాంగ సభలో దీని స్థానం గురించి చర్చ జరిగింది. 1947 జూలై 24న రాజ్యాంగ సభలో నిర్ణయం తీసుకున్నారు. “వందే మాతరం” మరియు “జనగణమన” ఈ రెండింటిని జాతీయ గీతాలుగా గుర్తించారు. “వందే మాతరం” గీతం వ్రాసి 150 ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, సాంస్కృతిక సంస్థల ద్వారా ఈగీతాన్ని ఈనాటి తరం వారికి స్పూర్తిగా దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు.
వందే మాతరం — అంటే కేవలం ఒక గీతం మాత్రమే కాదు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు భారతీయుల ఆత్మలో మ్రోగే దేశభక్తి మంత్రంగా మరోసారి దేశవ్యాప్తంగా ప్రతిధ్వనింప బోతోంది..