హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు పాత్రపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు?
చంద్రబాబు, రాజశేఖర్‌రెడ్డి, కేసీఆర్ లు హైదరాబాద్ ఖ్యాతికి కొంత వరకూ అర్హులు కదా అని రాజ్ దీప్ సర్దేశాయ్ అన్నారు. మీరు దానిని ముందుకు తీసుకుపోతున్నారు.. ప్రతి రాజకీయ నాయకుడు తమతో మొదలవుతుందని భావిస్తున్నారని రాజ్ దీప్ అనగానే రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మీరు సగం నిజమే చెప్పారన్న రేవంత్ రెడ్డి.. నేను పూర్తి వాస్తవం చెబుతానంటూ హైదరాబాద్ చరిత్ర ఏకరువు పెట్టారు.
హైదరాబాద్ అన్నది ఇప్పుడు ప్రారంభమైంది కాదన్న రేవంత్ రెడ్డి.. కులీ కుతుబ్ షాహీ నుంచి ప్రారంభమైంది. కులీ కుతుబ్ షా తర్వాత నిజాం సర్కార్, తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం, స్వాతంత్య్రం తర్వాత మర్రి చెన్నారెడ్డి, చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి.. అలా ఆ తర్వాత ఇప్పుడు నేను ఉన్నా... 450 ఏళ్లకుపైగా చరిత్ర తెలంగాణ, హైదరాబాద్‌కు ఉందని రేవంత్ రెడ్డి వివరించారు.
అంతే కాదు... చార్మినార్, గోల్కొండ కోట చంద్రబాబు కట్టారా? సికింద్రాబాద్ కంటోన్మెంట్ రాజశేఖర్ రెడ్డి, చంద్రశేఖర్ రావు కట్టారా..? హైదరాబాద్‌లో ప్రముఖ కట్టడాలన్నీ 450 ఏళ్ల నుంచే ప్రారంభమయ్యాయి. ప్రభుత్వాలు మారినా ముఖ్యమంత్రులు మారినా అభివృద్ధి కొనసాగింది. మీరు హైదరాబాద్ రండి.. ప్రపంచంలోనే అత్యుత్తమైన గాజులు, ముత్యాలు చార్మినార్ వద్ద దొరుకుతాయి. ఇప్పుడు డాలర్ల మార్పిడి చేస్తున్నాం...400 ఏళ్ల క్రితమే అక్కడ నగదు మార్పిడి ఉందని రేవంత్ రెడ్డి వివరించారు. ప్రపంచంలోని ఎక్కడ నగదు తీసుకువచ్చినా అక్కడ మార్చుకోవచ్చని సూచించారు.