ఎస్ఎల్బీసీ ప్రమాదం.. అసలు వాస్తవాలు దాస్తున్నారా?

 ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగి వారం రోజులు దాటినా ఇప్పటి వరకూ చిక్కుకుపోయిన వారీ ఆచూకీ తెలియలేదు. సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. దేశంలోనే పేరున్న 11 సంస్థలకు రప్పించామని ప్రభుత్వం చెబుతోంది. అయితే.. ఎస్ఎల్బీసీ ప్రమాదంలో ఉన్న  విషయాలను ఎందుకు దాస్తున్నారని ప్రశ్నించిన మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి... ఏదో బయటపడుతుందని ఆపుతున్నారని అన్నారు.


అక్కడ ఇప్పటి వరకు ఏం జరిగిందో కూడా చెప్పలేకపోతున్నారని... వచ్చిన నిపుణులను కూడా స్వేచ్ఛగా పని చేయనివ్వడం లేదని ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఆరోపించారు. నిపుణుల నివేదికలు ఎందుకు బయటకు రావడం లేదని ఆయన అడిగారు. ప్రమాదం ముందు ఏం జరిగిందో, ఇపుడు ఏం జరుగుతోందో విచారణ జరపాలని ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎస్ఎల్బీసీ ఘటనలో విచారణ జరిగితే ముఖ్యమంత్రి కూడా ఇరుక్కుంటారని ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి వ్యాఖ్యానించారు.


దిల్లీ వెళ్లి వచ్చినప్పటి నుంచి రేవంత్ రెడ్డి మోదీని పొగడుతునన్నారని... కిషన్ రెడ్డి, బండి సంజయ్ ను విమర్శిస్తున్నారని జగదీష్ రెడ్డి ఆక్షేపించారు. మోదీకి రేవంత్ రెడ్డి ఏజెంట్ గా ఉన్నారని... మోదీ టీముల మధ్య గొడవ లాగా కనిపిస్తోందని ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. మోదీతో  రేవంత్ రెడ్డి ఏ రహస్య ఒప్పందం చేసుకున్నారో పదవి కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఆరోపించారు.


మోదీ నిధులు ఇస్తుంటే... కిషన్ రెడ్డి అడ్డుకుంటే ఆగుతాయా అని ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. కేవలం పదవి కాపాడుకునేందుకు మోదీతో అంటకాగుతూ, పొగడుతూ... ఇక్కడి బీజేపీ నేతలను తిట్టడం ఒక డ్రామాగా ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అభివర్ణించారు. రేవంత్ రెడ్డి వైఖరిపై కాంగ్రెస్ కార్యకర్తలు ఆలోచించుకోవాలని ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి సూచించారు. హరీశ్ రావు అబుదాబీ పర్యటనను సీఎం తప్పుడుతున్నారని... అక్కడ కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా చాలా మంది ఉన్నారని ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి గుర్తు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: