ఏపీ ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ జీవి రెడ్డి రాజీనామా ఉదంతం తెలుగుదేశం పార్టీ తో పాటు ఏపీ కూటమి ప్రభుత్వ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా అంతా జీవి రెడ్డికి సపోర్ట్ గా పోస్టులు పెడుతూ హోరెత్తిస్తోంది. ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జగన్ వెంట ఉన్న వాళ్లే ఈ రోజు చంద్రబాబుకు సలహాలు ఇచ్చే వాళ్లు అయిపోయారా ? చంద్రబాబు జైలులో ఉంటే తమ కుటుంబం లో వ్యక్తికి కష్టం వచ్చిందని నిద్రాహారాలు, తిండి మానేసి రోడ్డెక్కి లాఠీ దెబ్బలు తిన్న కరుడు కట్టిన టీడీపీ అభిమానుల కంటే .. ఈ రోజు నాడు జగన్ భజన చేసిన వారి అభిప్రాయాలే బాబుకు ఎక్కువ అయ్యాయా ? అన్న ప్రశ్నలు టీడీపీ సోషల్ మీడియా అభిమానులు వాల్స్ మీద కనిపిస్తున్నాయి. టీడీపీ అభిమానుల ఐదేల్ల కష్టం.. కారిన చెమట.. చిందిన రక్తం, తగిలిన గాయాలు. మరకలు ఇంకా మాసిపోకముందే తమ వేలితో తమ కంటినే పొడుచుకునేలా బాబు పాలన .. నిర్ణయాలు ఉన్నాయంటూ టీడీపీ వీరాభిమానులు రక్తం మరిగిపోతుందని చెపుతూ మరీ కామెంట్లు చేస్తున్నారు.
నాలుగు సార్లు ముఖ్యమంత్రి... 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా అధికారం అనుభవం ఉంది..90 % ప్రజల మద్దతు ఉంది..కష్టించే మనస్తత్వం ఉంది..దేశంలో గుర్తింపు ఉంది.. ప్రధాని దగ్గర ప్రత్యేకమైన విలువ ఉంది.. ప్రపంచం లోనే గుర్తింపు ఉంది.. అన్ని ఉన్నా మీ పతనం కోరుకొనే వారిని కట్టడి చేయలేని పాలన ఎందుకు అంటూ టీడీపీ వీరాభిమానులు ... సోషల్ మీడియా అభిమానులు చంద్రబాబును దుమ్మెత్తి పోస్తున్నారు. ఇంకా పోలీస్ వ్యవస్థలో మాత్రమే కాదు... చాలా మంది అధికారులు నాటి ప్రభుత్వ కోవర్టుల గానే పని చేస్తున్నారని ... వారిని ఏం చేయలేని నిస్సహాయ స్తితిలో ఈ ప్రభుత్వం ఉందని టీడీపీ అభిమానులు నిట్టూరుస్తున్నారు. ఏదేమైనా జీవి రెడ్డి ఇష్యూ తో నాడు చంద్రయ్య ఉదంతాన్ని తెలుగు తమ్ముళ్లు గుర్తు చేసుకుంటున్నారు. జై జగన్ అనని చంద్రయ్య.. నేడే జై ఐఏఎస్ అనని జీవి రెడ్డి ఒక్కటే అని పోస్టులు పెడుతున్నారు.