ఆ రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం.. ఖాతాల్లోకి డబ్బులు?
తెలంగాణ రాష్ట్రంలో రైతుభరోసా పథకం కింద పెట్టుబడి సాయం నిధుల పంపిణీ ప్రక్రియ సాగుతోంది. నిన్నటి నుంచి మూడు ఎకరాల విస్తీర్ణం వరకు సాగులో ఉన్న వ్యవసాయ పంట భూములు సంబంధించి రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ అవుతున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మొత్తం 9,54,422 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో 1230.98 కోట్ల రూపాయలు జమ కానున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
ఇక 2 ఎకరాల లోపు విస్తీర్ణం రికార్డ్స్ అప్డేట్ చేసిన మరో 56,898 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో 38.34 కోట్ల రూపాయలు కూడా జమ చేయబడుతోన్నాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. దీంతో మూడు విడతల్లో కలిపి ఇప్పటికీ 44,82,265 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో 58 లక్షల 13 వేల ఎకరాలకు 3487.82 కోట్ల రూపాయలు నిధులు జమ అయ్యాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు గత జనవరి 26వ తేదీన మండలంలో ఒక గ్రామం చొప్పున ఎంపిక చేసి పైలట్ ప్రాజెక్టు కింద రైతుభరోసా పథకం నిధుల జమ ప్రారంభించిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 3 విడతల్లో 3 ఎకరాల వరకు ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతుభరోసా నిధులు జమ చేయడం జరిగిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మొదటి విడతలో ఎకరా విస్తీర్ణం వరకు 17.03 లక్షల మంది రైతులకు 9.29 లక్షల సాగు భూమికి 557.54 కోట్ల రూపాయలు జమ అయ్యాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
రెండో విడతలో 13.23 లక్షల మంది రైతులకు 18.19 లక్షల ఎకరాలకు 1091.95 కోట్ల రూపాయలు, మూడో విడతలో 10.13 లక్షల మంది రైతులకు 21.12 లక్షల ఎకరాలకు 1269.32 కోట్ల రూపాయలు జమ అయ్యాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. రైతులు ఈ మొత్తం రైతులు, వ్యవసాయ పెట్టుబడి పెట్టుబడుల అవసరాల కోసం వినియోగించుకోవాలని... మిగతా రైతులకు రైతులకు కూడా త్వరలోనే జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కోన్నారు.