![శెభాష్ లోకేష్..! ఏపీ విద్యావ్యవస్థలో సంచలన మార్పులు తీసుకువస్తున్నారు గా..?](https://www.indiaherald.com/cdn-cgi/image/width=350/imagestore/images/editorial/77/nara-lokesh0b40d074-3747-4938-80d6-5de260df7311-415x250.jpg)
శెభాష్ లోకేష్..! ఏపీ విద్యావ్యవస్థలో సంచలన మార్పులు తీసుకువస్తున్నారు గా..?
కూటమి ప్రభుత్వంలో నారా లోకేశ్ మానవ వనరుల శాఖా మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీని పరిధిలోకే విద్యాశాఖ కూడా వస్తుంది. విదేశాల్లో చదివిన నారా లోకేశ్ విద్యాశాఖ చేపట్టడం మూలంగా పలు మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటికే ఆయన విద్యా శాఖలో గొప్ప సంస్కరణలకు నాంది పలుకుతున్నారు.
అందులో భాగంగా ప్రతి శనివారం నో బ్యాగ్ డే విధానం అమలు చేయాలని భావిస్తున్నారు. ఇది నిజంగా మంచి ఆలోచననే చెప్పాలి. ప్రస్తుత రోజుల్లో విద్యార్థులు కేజీల కొద్దీ బుక్స్ బరువుతో మోయలేని బ్యాగులతో కనిపిస్తున్నారు. పొద్దునే లేచి స్కూల్ కి వెళ్లడం పొద్దుపోయిన తర్వాత ఇంటికి రావడం… వచ్చిన తర్వాత మళ్లీ హోం వర్కులు చేసి అలసి పోయి పడుకోవడం, కొద్ది సేపు ఫోన్ చూడటంం ఇదే వారి దినచర్యగా మారిపోయింది. ప్రస్తుత పిల్లలు ఆరుబయట ఆడుతూ కనిపించడం మానేశారు. ప్లే గ్రౌండ్ లకు బైబై చెప్పేస్తున్నారు. 24 గంటలు చదువుతూనే కుస్తీ పడుతున్నారు.
ఇక తరగతి గదుల్లో పగలే వెన్నెల మాదిరిగా లైట్లు ఫ్యాన్లు వేసి అన్నీ బంధించి పాఠాలు చెబుతున్నారు. ఇక ఆట విడుపు లేదు, పాట విడుపు అంతకంటే లేదు. దీనివల్ల వారి మానసిక ఎదుగుదలపై ప్రభావం చూపుతోంది. నిరంతరం రుబ్బుడు ప్రోగ్రాంతో విద్యార్ధి బంగారు భవితను నాలుగు గోడల మధ్యన నలిగిపోయేలా చేస్తున వైనాలు దైన్యాలు కళ్ళ ముందు ఉన్నాయి.
ఈ పరిస్థితి మారాలని అంతా కోరుకుంటున్నారు. ఈ క్రమంలో ఏపీ మంత్రి నారా లోకేశ్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. తాజాగా ఆయన విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. ఇక వీకెండ్ లోనూ నో బ్యాగ్ డే విధానాన్ని ప్రతీ స్కూల్ లో అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ రోజున చదువుని కాస్తా పక్కన పెట్టేసి ఎక్స్ ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ పేరుతో విద్యార్ధికి మానసిక ఉల్లాసం కలిగించే ప్రయత్నం చేస్తారు అని అంటున్నారు.
నిజానికి ఈ విధానం అమలు చేయాలని నిపుణులు కూడా అంటున్నారు. లోకేష్ చాలా దూర దృష్టిలో ఏపీలో అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలలో అమలు చేయడానికి నిర్ణయించడం మంచి పరిణామమని అంటున్నారు. పిల్లల మానసిక వికాసం కోసం కొత్త అభ్యాసాలను కూడా అలవరచుకునేలా కార్యాచరణ చేపట్టాలని లోకేశ్ కోరారు. మొత్తానికి లోకేష్ తీసుకున్న నో బ్యాగ్ డే నిర్ణయం విద్యా వ్యవస్థలో మంచి మార్పునకు నాందిగా అంతా చూస్తున్నారు.