చంద్రబాబు చేసిన సాయాన్ని మోదీ మర్చిపోలేక పోతున్నారా..?

ఘన విజయాలు, సంచలన విజయాలు మాత్రం అరుదుగా వస్తుంటాయి. అలాంటి భారీ విజయం ఏపీ ప్రజలు ఎన్డీయే కూటమికి 2024 ఎన్నికల్లో కట్టబెట్టారు. ఎన్నికల లతర్వాత ఏపీకి తొలిసారి ప్రధాని నరేంద్ర మోడీ వచ్చారు.  విశాఖ సభలో ఆయన మాట్లాడుతూ తెలుగులోనే ఏపీ ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు. మీరు ఇంతటి అనూహ్య విజయం ఇచ్చారు. దానిని నేను మేలు చేయాల్సిన సమయం వచ్చింది అంటూ రెండు లక్షల కోట్ల రూపాయల విలువ చేసే పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు


ఎంతో హుషారుగా మాట్లాడిన మోడీ ఏపీ ప్రజల అభిమానం మరచిపోలేను అన్నారు.  అయిదేళ్ళ తరువాత ఏపీలో తిరిగి ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చింది అని చెప్పి హర్షం వ్యక్తం చేశారు.  ఏపీలో ఎన్డీయే కూటమిని ఆదరించిన ప్రజలకు తాను అండగా ఉంటాను అని మనసు విప్పి ప్రధాని చెప్పారు. చంద్రబాబు విజన్ కి ఆయన ఆలోచనలకు కేంద్రం పూర్తిగా మద్దతు ఇస్తుందని సభా సాక్షిగా ప్రకటించారు. ఏపీకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ముందుకు నడిపిస్తామని ఆర్ధికంగా ఏపీ బలోపేతం అయ్యేలా చూస్తామని కూడా ప్రకటించారు.


చంద్రబాబు దార్శనికతను పదే పదే మోడీ మెచ్చుకోవడం ప్రసంగంలో కనిపించింది.  అంతే కాదు ఏపీ అభివృద్ధిలో అగ్రగామిగా ఉంటుదని మంచి ఫ్యూచర్ ఉందని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక చంద్రబాబు తన స్పీచ్ లో అయితే మోడీ స్పూర్తితో ఏపీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని పోలవరం అమరావతి వంటి రెండు ల్యాండ్ మార్క్ డెవలప్మెంట్స్ ని కూడా సుసాధ్యం చేసి చూపిస్తామని చెప్పారు.


పవన్ కళ్యాణ్ మోడీని ఆకాశానికి ఎత్తేశారు. కన్యాకుమారి నుంచి జమ్మూకశ్మీర్ వరకు  ప్రధాని మోదీ భారతదేశాన్ని ఏకం చేశారని అన్నారు.  అంతే కాదు భారత్‌ను ప్రపంచంలోనే మూడో అత్యంత శక్తివంతమైన దేశంగా మార్చిన ఘనత మోదీకి దక్కిందని అన్నారు.  ఇక ప్రధాని సభలో మరో ఆకర్షణ నారా లోకేష్. ఆయన పవన్ ని తన అన్నగా సంభోదించడం హైలెట్ అయి చప్పట్లు కురిసేలా చేసింది. మొత్తానికి మోడీ తొలిసారి ఏపీకి రావడంతో విశాఖలో నిర్వహించిన సభ అంచనాలను మించి సూపర్ హిట్ అయింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: