మంగ‌ళ‌గిరిలో మ‌ళ్లీ సెన్షేష‌న్ రికార్డు కొట్టేసిన నారా లోకేష్‌..!

RAMAKRISHNA S.S.
- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) . . .

ఏపీ లోని అధికార కూటమి లోని తెలుగుదేశం పార్టీ రికార్డు నమోదు చేసింది. టిడిపి సభ్యత్వ నమోదులో మంగళగిరి నియోజకవర్గం చరిత్ర సృష్టించింది .. రికార్డు స్థాయిలో మంగళగిరి నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు జరిగింది. ఇప్పటికే మంగళగిరి నియోజకవర్గం లో సభ్యత్వాలు లక్ష మార్కు దాటేసాయి. నియోజకవర్గ చరిత్రలోనే ఇది సరికొత్త రికార్డు అని టిడిపి నేతలు చెబుతున్నారు. టిడిపి సభ్యత్వాలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొదటి స్థానంలో మంగళగిరి నియోజకవర్గ నిలిచింది. నారా లోకేష్ ప్రాథినిత్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో టిడిపి గత ఎన్నికలలో అఖండ విజయం సాధించింది. మొన్నటి ఎన్నికలలో లోకేష్ ఏకంగా 92 వేల ఓట్ల భారీ మెజార్టీ వచ్చింది. ఇక మంగళగిరి ప్రజల స్వచ్ఛందంగా ముందుకు వచ్చి టిడిపి సభ్యత్వం తీసుకుంటున్నారని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు.

సభ్యత్వాలు తీసుకున్న సభ్యులకు టిడిపి నేతలు అభినందనలు చెబుతున్నారు. వాస్తవానికి 2019 ఎన్నికలలో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేశారు నారా లోకేష్. ఆ ఎన్నికలలో లోకేష్ వైసీపీ నుంచి పోటీ చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఐదు వేల ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. అయితే ఐదేళ్లపాటు లోకేష్ ప్రతిపక్షంలో ఉంటూ మంగళగిరి నియోజకవర్గం పై బాగా ఫోకస్ పెట్టారు. ఆయనకు ఎలాంటి అధికారం లేకపోయినా తమ పార్టీ పవర్ లో లేకపోయినా కూడా మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ వారికి కావలసిన పనులు చేసి పెట్టారు.

ఈ క్రమంలోనే మొన్నటి ఎన్నికలలో మంగళగిరిలో లోకేష్ ఏకంగా రికార్డు స్థాయిలో 92,000 ఓట్ల భారీ మెజార్టీతో ఘ‌న విజయం సాధించి తొలిసారి సగ‌ర్వంగా అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. ఇక తాజాగా సభ్యత్వాలను మొదలు పెట్ట‌గా ఒక్క మంగళగిరి నియోజకవర్గం నుంచి ఏకంగా లక్ష పార్టీ సభ్యత్వాలు నమోదు కావటం కూడా ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే సరికొత్త రికార్డుగా నిలిచిపోయింది. దీనిని బట్టి మంగళగిరిలో లోకేష్ తెలుగుదేశం పార్టీని ఏ స్థాయిలో బలోపేతం చేస్తున్నారో అర్థమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: