వయసు పెరుగుతున్న వన్నెతగ్గని పొలిటికల్ గ్లామర్ హీరో చంద్రబాబు.. !
ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి అమరావతి పనులు అస్సలు పట్టించుకోలేదన్న విమర్శలను నిజం చేస్తూ.. అమరావతిలో అభివృద్ధి అంటే ఏంటో ఆయన రుచి చూపిస్తున్నారు. కేంద్రంలో ఆయన రెండో అతిపెద్ద పార్టీకి రథసారథిగా ఉండటం చంద్రబాబుకు ఈ దశలో పట్టిన అదృష్టం అని చెప్పాలి. గతంలో మాదిరిగా ఆయన విజ్ఞప్తులను ఏకపక్షంగా తోచిపుచ్చలేని స్థితిలో ఈసారి మోడీ సర్కారు ఉంది. అందుకే పథకాలకు రాజధానికి, పోలవరానికి బాగా సాయం అందుతుంది. ఏ పనులు ప్రజల ఎదుటకు, ప్రజలకు కనిపిస్తాయో.. ఏ పనులు మంచి పేరు కీర్తి తెచ్చి పెడతాయో.. అలాంటి పనుల మీద చంద్రబాబు దృష్టి పెట్టడం ఆయన తాజా రాజనీతికి నిదర్శనం.
వయసు పెరుగుతున్న కొద్దీ మనిషిలో సహనం - శక్తి తగ్గుతాయని అంటూ ఉంటారు. కానీ.. చంద్రబాబు ప్రత్యేకమైన వ్యక్తి 75 ఏళ్ల వయసులో ఆయన పెట్టిన చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. అసూయ కూడా కలుగుతుంది. సమీక్ష సమావేశాల పేరిట నిరంతరాయంగా కూర్చోవడం కూడా సులువేమీ కాదు. ఆయనలో వయతో పాటు శక్తి మాత్రమే కాదు.. సహనం కూడా పెరుగుతున్నాయని మనం గమనించాలి. ఏది ఏమైనా ఈ ఏడాది భారతీయ రాజకీయ యువనిక పై పొలిటికల్ పర్సన్ ఆఫ్ ది హీరోగా చంద్రబాబును అభివర్ణించడంలో ఎలాంటి సందేహం లేదు.