చంద్రబాబు - పవన్ మల్టీస్టారర్ .. 2024 ఇండియన్ పొలిటికల్ బ్లాక్ బస్టర్ హిట్.. !
2014 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు జనసేన పార్టీ స్థాపించిన పవన్ కళ్యాణ్.. ఆ ఎన్నికలలో పోటీ చేయకుండా రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ బిజెపికి సపోర్ట్ చేసి.. ఆ రెండు పార్టీలు కలిసి అధికారంలోకి వచ్చేందుకు తన వంతుగా కృషి చేశారు. అయితే 2019 ఎన్నికల సమయంలో ఒంటరిగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్.. ఐదేళ్ల చంద్రబాబు పాలనను బీభత్సంగా తిట్టిపోశారు. లోకేష్‌ను సైతం విమర్శించారు. అసలు ఈ రెండు పార్టీలు భవిష్యత్తులో ఎప్పటికీ తిరిగి స్నేహం చేయవు అనంతగా వ్యవహారం చేడింది. ఎన్నికల్లో ఓటమి తర్వాత పవన్ కళ్యాణ్ వెళ్లి బిజేపితో కలిసిపోయారు.
అలాంటి బంధాన్ని తిరిగి పునరుద్ధరించుకోవటానికి చంద్రబాబు తన రాజకీయ చాతుర్యాన్ని చక్కగా ఉపయోగించుకున్నారు. ఈ విషయంలో చంద్రబాబు తో పాటు.. అటు పవన్ కళ్యాణ్ కూడా తనను తాను తగ్గించుకున్నారు. ఈ రెండు పార్టీలకు తోడు బిజెపి కూడా వచ్చి చేరింది. మూడో పార్టీలు కలిసి జగన్మోహన్ రెడ్డిని గద్దెదించే వరకు విశ్రమించలేదు.. నిద్రపోలేదు. అలా ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పొలిటికల్ మల్టీస్టారర్ సూపర్ డూపర్ హిట్ అయింది. వీరు సాధించిన అప్రతిహత విజయం భారతదేశ రాజకీయ చరిత్రలోనే గొప్ప విజయంగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణించారు.