పవన్ కళ్యాణ్ సినిమా డైలాగ్‌తో సూపర్ హిట్ కొట్టిన చంద్రబాబు.. !
పవన్ పార్టీ వాళ్లు స్వయంగా తెలుగుదేశం గత పాలన గురించి విమర్శలు చేస్తూ వచ్చినా పట్టించుకోలేదు. తమ వాళ్ళు ఎవరు పవన్ కళ్యాణ్‌ను పల్లెత్తుమాట అనకుండా చూసుకున్నారు. అలా తగ్గి మొత్తానికి పవన్‌తో స్నేహబంధం కుదిరిన తర్వాత చంద్రబాబు సీట్ల పెంపకం దగ్గరికి వచ్చేసరికి చాలా దృఢంగా వ్యవహరించారు. మొదట 60 సీట్లు కావాలని బేరం ప్రారంభించిన జనసేనను.. 30 కి ఒప్పించారు. పొత్తు బంధంలోకి భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత కూడా అదే 30 సీట్లు ఇద్దరికీ కలిపి ఇవ్వగలనని తెగేసి చెప్పారు. ఈ విషయంలో చంద్రబాబు దృఢంగానే ఉన్నారు. చివరికి వారిద్దరు కలిసి 30కి ఒప్పుకున్నారు. చివరి క్షణాల్లో కొసరి వేసినట్టుగా పవన్ కళ్యాణ్‌కు ఒక సీటు అదనంగా ఇచ్చారు.
పొత్తు బంధానికి సంబంధించిన ప్రకటన వచ్చేవరకు సౌమ్యంగా రాజకీయం నడిపిన చంద్రబాబు.. ప్రకటన వచ్చిన తర్వాత తన రాజనీతి ప్రదర్శించి దృఢంగా ఉన్నారు. ఆ ఫలితంగానే ఈరోజు ఆ రెండు పార్టీలకు వచ్చిన సీట్లు కలవకపోయినా సరే.. అధికారం చలాయించగలిగే స్థాయి సీట్ల బలంతో ఉన్నారు. అటు జనసేన, బిజెపి బలం లేకపోయినా కూడా.. చంద్రబాబుకు తిరుగులేని మెజార్టీ ఉంది. అలానే చంద్రబాబు వారిని చిన్నచూపు చూడటం లేదు. రెండు పార్టీలకు సమాన ప్రాధాన్యమిస్తున్నారు. క్యాబినెట్లో మాత్రమే కాదు నామినేటెడ్ పదవుల విషయంలో సమతూకం పాటిస్తున్నారు. ఏది ఏమైనా చంద్రబాబు ప్రదర్శిస్తున్న పరిణితి ఆయనతోపాటు తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు రాజకీయానికి ఎంత దోహదం చేస్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు.