
రివ్యూ:L2 ఎంపురాన్ మూవీ రివ్యూ.. సినిమాకి హైలెట్స్ అవే..!
తాజాగా విడుదలైన ఈ సినిమా చూసిన పలువురు సోషల్ మీడియా నెటిజన్స్ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉన్నారు..L2 ఎంపురాన్ సినిమాకి పాజిటివ్గా టాక్ వినిపిస్తోంది.కథలో డెప్త్, స్క్రీన్ ప్లే ఉన్నప్పటికీ కూడా చాలా సన్నివేశాలు ఉత్కంఠతగా చూపించారని పృథ్విరాజ్ మేకింగ్, మోహన్ లాల్ యాక్టింగ్ సూపర్ గా ఉందంటూ పలువురు నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది ఈ సినిమా లూసీఫర్ రేంజ్ లో లేకపోయినా బాగానే ఉందని కామెంట్స్ చేస్తున్నారు. కంటెంట్ పరంగా అద్భుతంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
L2 చిత్రంలోని హైలెట్స్ సన్నివేశాలలో ఇంటర్వెల్ సన్నివేశం, సెకండ్ హాఫ్ లో అదిరిపోయే ట్విస్టులు, క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కూడా అదిరిపోయింది అంటూ పరుగులు నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే మోహన్లాల్ ని చూపించిన విధానం కూడా ఈ చిత్రం మొత్తానికే హైలైట్ గా ఉన్నదట.మొత్తానికి L2 చిత్రం పాజిటివ్ టాక్ తోనే దూసుకుపోతున్నది. ఓపెనింగ్స్ కూడా భారీగానే రాబట్టినట్లు టాక్ వినిపిస్తోంది.మరి కలెక్షన్స్ పరంగా ఏ విధంగా రాబట్టిందో తెలియాల్సి ఉన్నది.