ఈసారి జగన్ కి ఆ ఛాన్స్ ఇవ్వనంటున్న చంద్రబాబు?
వైసీపీకి ఎట్టి పరిస్థితుల్లోనూ చాన్స్ ఇచ్చేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అంటున్నారు. ఆయన గతాన్ని నుంచి అనేక పాఠాలను నేర్చుకుంటున్నారు. అందుకే ఎక్కడా తప్పులు జరగకుండా చూసుకుంటున్నారు. ఈసారి అన్ని హామీలను కాస్తా ముందూ వెనకా అయినా నెరవేర్చాలని గట్టి పట్టుదలలో ఉన్నారని అంటున్నారు. వైసీపీకి ఏ విధంగానూ పొలిటికల్ అడ్వాంటేజ్ కలగకుండా చూడాలన్నదే చంద్రబాబు పంతం అని అంటున్నారు.
వైసీపీ విషయం చూస్తే సంక్షేమ పథకాలను చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయలేదని అదే చివరికి వారికి వ్యతిరేకంగా తమకు అనుకూలంగా మారుతుందని లెక్క వేసుకుంటోంది. జగన్ తరచూ పార్టీ సమావేశాలలో సూపర్ సిక్సూ లేదు సెవెనూ లేదని సెటైర్లు వేస్తూంటారు. ఇక అభివృద్ధి విషయం తీసుకుంటే టీడీపీయే అక్కడ ఛాంపియన్. ఉమ్మడి ఏపీలో కానీ విభజన ఏపీలో కానీ చంద్రబాబు చేసిన అభివృద్ధి కనిపిస్తుంది.
ఈ నేపథ్యంలో ఆయన సంక్షేమానికి పదును పెడితే చాలు వైసీపీకి జగన్ కి మళ్లీ నో ఛాన్స్ అని అంటున్నారు. ఇక మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని సంక్రాంతి నుంచి అమలు చేయాలని కూటమి ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉందని అంటున్నారు. రైతులకు పెట్టుబడి సాయం అన్నదాతా సుఖీభవ పేరుతో అమలు చేయాలని కూటమి నిర్ణయించింది. ఇది కూడా సంక్రాంతి కానుకగా రైతన్నలకు ఇస్తరాని అంటున్నారు.
మరో వైపు తల్లికి వందనం పేరుతో ప్రతీ విద్యార్ధికి ఇచ్చే పదిహేను వేల రూపాయలను కూడా విద్యా సంవత్సరం పూర్తి కాక ముందే ఇవ్వాలన్న పట్టుదలతో కూటమి ప్రభుత్వం ఉందని అంటున్నారు. మొత్తానికి చూస్తే సూపర్ సిక్స్ హమీలు అన్నీ కూడా వరసబెట్టి అమలు చేయాలని చంద్రబాబు అయితే కంకణం కట్టుకున్నారని అంటున్నారు.
అమలు చేస్తే వైసీపీకి ఏ ఒక్క ఆయుధమూ ఉండదని కూడా అంటున్నారు. అపుడు ఆ పార్టీ జనంలోకి వెళ్ళినా మద్దతు అయితే దక్కే సూచనలు ఉండవని కూడా భావిస్తున్నారు. ఇలా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ఎన్ని కష్టాలు ఎదురైనా కూటమి బండిని నడిపించడం ద్వారా వరస విజయాలను అందుకోవాలని చంద్రబాబు మాస్టర్ ప్లాన్ తో ఉన్నారు. సో కూటమి సూపర్ సిక్స్ తో వైసీపీ క్లీన్ బౌల్డ్ అవుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.