అమరావతికి ఇంకా ఆ 15 వేల కోట్ల సాయం అంద లేదా? కొర్రీలతో కేంద్రం ఇబ్బంది పెడుతుంతా?
ఈ అప్పు పదిహేను వేల కోట్ల రూపాయలు. ఇంతటి అప్పు ఇవ్వడానికి ఎన్నో గంటల పాటు చర్చలు కూడా జరిగాయి. కేంద్ర రాష్ట్ర అధికారుల సమక్షంలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ అధికారులు అనేక అంశాల మీద సుదీర్ఘంగా చర్చించాయి. ఏకంగా ఎనిమిది గంటల పాటు ఈ చర్చలు సాగాయి. అప్పు ఇస్తున్న ప్రపంచ బ్యాంకు ఏడీబీ ఒప్పందంలో ఏ ఏ అంశాలు పొందుపరచాలి అన్న దాని మీద కేంద్ర రాష్ట్ర అధికారులతో కలసి తీవ్రమైన కసరత్తునే చేశాయి.
మొత్తానికి ఈ కసరత్తు పూర్తి అయింది. ఇక ఒప్పందాలలో ఏ ఏ అంశాలు ఉంటాయో అయితే తెలియలేదు. ప్రపంచ బ్యాంకు ఇచ్చే రుణాల మీద షరతులు అయినా ఒప్పందాలు అయినా కొంత కచ్చితంగానే ఉంటాయని అంటున్నారు. ప్రపంచ బ్యాంకు అన్ని విషయాలనూ పూర్తిగా పరిశీలించిన మీదటనే రుణాలు ఇస్తుంది. పర్యావరణం వంటి వాటి విషయంలో ఎక్కువగా ఫోకస్ పెడుతుంది అని అంటున్నారు.
ఇచ్చిన రుణాలను దేని కోసం అయితే ఉద్దేశించారో వాటికే ఖర్చు చేయాలని కూడా కీలక షరతులు ఉంటాయని అంటున్నారు. ఏపీ అధికారులు ప్రపంచ బ్యాంకు ఏడీబీల మధ్య ఒప్పందాలు కుదిరితే దానికి కేంద్రం తరఫున అధికారులు పూచీకత్తుగా ఉంటారరని తెలుస్తోంది. ఒక విధంగా కేంద్ర ప్రభుత్వమే ఈ ఒప్పందంలో ఉంటూ కుదుర్చుకుందని కూడా భావించాల్సి ఉందని అంటున్నారు.
రేపటి రోజున రుణాల విషయంలో పూచీకత్తుగా ఉన్న కేంద్రమే బాధ్యత వహిస్తుందని అంటున్నారు. ఈ విధంగా తుది ఒప్పంద పత్రాలు అయితే పూర్తి అయ్యాయి. అందులో చేర్చిన అంశాలు అన్నీ కూడా ఇపుడు తుది ఒప్పంద పత్రాలలో ఉన్నాయి. వాటిని ప్రపంచ బ్యాంక్ అలాగే ఏడీబీ అధికారులు పూర్తి స్థాయిలో పరిశీలించి ఆమోదముద్ర వేయనున్నాయి.
అంటే ఒక్క అడుగు దూరంలో అప్పు నిలిచి ఉంది అన్న మాట. అక్కడ పరిశీలన పూర్తి అయి అధికారిక ఆమోదముద్ర కనుక పడితే ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి పదిహేను వేల కోట్ల రూపాయలు అప్పు పుట్టినట్లే అని అంటున్నారు. అయితే ఈ ఆర్ధిక సంవత్సరం నాలుగు నెలలు మాత్రమే ఉంది. ఈ ఏడాది ఎంత రుణం ఇస్తారు వచ్చే ఏడాది ఎంత ఇస్తారు అన్నది తొందరలోనే తేలనుంది అని అంటున్నారు.