భారత్ కి బిగ్ షాక్..! మన దేశాన్ని విడిచి వెళ్తున్న యువత ? రీసన్ తెలిస్తే షాక్ అవుతారు?
2023లో 2లక్షల 16 వేల మంది… 2019లో లక్షా 44 వేల మంది.. 2014లో లక్షా 29 వేల మంది. ఎవరు వీళ్లంతా.... 2014 నుంచి 2023 వరకు వీళ్ల సంఖ్య ఎందుకు పెరుగుతోంది..? వీళ్లంతా భారతీయులే... మన దేశంలో పుట్టి పెరిగిన వాళ్లే.. కానీ ఇప్పడు వీళ్లు మన దేశంలో లేరు.. పౌరసత్వాన్ని కూడా వదిలేసుకున్నారు... వివిధ దేశాలకు తరలివెళ్లి...అక్కడే శాశ్వత పౌరులుగా ఉండిపోయారు...
2014 తర్వాత.. ఈ పదేళ్లలో దేశాన్ని విడిచిపెట్టిన వారి సంఖ్యలో 67శాతం పెరుగుదల నమోదైంది. 2014లో మోదీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాటి రోజులను గుర్తు చేసుకుందాం. మేక్ ఇన్ ఇండియా..! భారత్‌ను ప్రపంచంలో టాప్ మాన్యుఫాక్చరింగ్ సెంటర్‌గా మార్చాలనే లక్ష్యంతో మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. సీన్ కట్ చేస్తే.. ఈ పథకం ఆశించిన స్థాయిలో హిట్ కాలేకపోయిందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఇండియన్స్ భారీగా భారత్‌ను విడిచి వెళ్తున్నారని.. పెట్టుబడులు కూడా ఇతర దేశాల్లో ఎక్కువగా పెడుతున్నారని లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.
చాలా మంది భారతీయులు.. ముఖ్యంగా బడా పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు ఇండియాలో కాకుండా విదేశాలలో అవకాశాలను సృష్టించుకుంటున్నారు. ఇటీవల భారత పౌరసత్వం విడిచిపెట్టిన వారి సంఖ్య కూడా బాగా పెరిగింది. 2022లో 2 లక్షల 25 వేల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదిలేశారు. వీరంతా ఎక్కువగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా లాంటి దేశాలకు వెళ్లారు. అక్కడ ఉద్యోగ అవకాశాలతో పాటు క్వాలిటీ ఆఫ్ లైఫ్ వీరిని ఎక్కువగా ఆకర్షించింది.
భారత్‌లో పన్ను వసూలు ఎక్కువ. దీని కారణంగా ఇండియాలో వ్యాపారం చేయడం కష్టంతో పాటు నష్టంతో కూడుకున్న విషయమని చాలామంది వ్యాపారవేత్తలు భావిస్తున్నారు. భారతీయులు ఇతర దేశాల్లో పెట్టుబడులు భారీగా పెడుతుండడానికి పదేళ్ల నుంచి కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు కూడా ఒక కారణంగా విశ్లేషకులు అభిప్రాయడపతున్నారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న కొన్ని ఆర్థిక విధానాలు, దేశీయ పెట్టుబడిదారులకు భయాన్ని కలిగించాయి. నోట్ల రద్దు లాంటి నిర్ణయాలు ఆర్థిక సంక్షోభానికి దారితీశాయన్నది నిపుణుల మాట. నోట్ల రద్దు తర్వాత, చిన్న వ్యాపారాలు MSME సంస్థలు భారీ నష్టాల పాలయ్యాయి. ఆ తర్వాత దేశీయ పెట్టుబడులు క్రమంగా తగ్గాయి.
2017లో కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ విధానం కూడా వ్యాపారుల కష్టాలను పెంచింది. జీఎస్టీ అమలు తర్వాత వ్యాపార ఖర్చులు పెరిగాయి. దీంతో భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు వ్యాపారులు ఆసక్తి చూపడం తగ్గిపోయింది. ఇక 2014 తర్వాత దేశంలో ఉపాధి అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. ఏటా లక్షలాది మంది యువతులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇండియాలో తగినంత అవకాశాలు లేకపోవడంతో యువత ఎక్కువగా విదేశాలకు వలసపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో వారు అక్కడే పెట్టుబడులు కూడా పెట్టుకుంటున్నారు. 2014 నుంచి 2020 వరకు దేశీయ ఉపాధి రేటు కేవలం 3-4శాతం మాత్రమే ఉంది.
రూపాయి విలువ 2014లో డాలర్‌కి 60 రూపాయల వద్ద ఉంటే ఇప్పుడది 80 దాటేసింది. ఇలా మేకిన్ ఇన్ ఇండియా ఫెయిల్యూర్, పన్నులు, నోట్ల రద్దు, జీఎస్టీ, రూపాయి బలహీనత లాంటి అంశాలు భారత్ పెట్టుబడిదారులపై ప్రతికూల ప్రభావం చూపాయి. దీంతో విదేశాల్లో భారతీయ పెట్టుబడులు పెరిగాయి.