పాక్ బుద్ధి మారదా? దీపావళి రోజున భారత్ లో భారీ దాడులకు పాక్ కుట్ర..?

దీపావళి వేళ జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల భారీ కుట్ర భగ్నమయ్యింది. సరిహద్దులో తిష్టవేసిన 60 మంది ముష్కరుల చొరబాటును సైన్యం తిప్పికొట్టింది. అఖ్నూర్‌ సెక్టార్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. అమెరికాలో తయారైన రైఫిళ్లతో పాటు అధునాతన ఆయుధాలను ఆర్మీ సీజ్‌ చేసింది. అఖ్నూర్‌ సెక్టార్‌లో రెండు రోజుల పాటు భారీ ఎన్‌కౌంటర్‌ కొనసాగింది. ముగ్గురు ఉగ్రవాదులను కడతేర్చింది సైన్యం.. వాస్తవానికి ఈ ఆపరేషన్‌ ఓ యుద్దంలా కొనసాగింది.


అయితే ఉగ్రవాదుల చొరబాటును సైన్యం తిప్పికొట్టింది. అక్నూర్‌ సెక్టార్‌లో చొరబడ్డ ఉగ్రవాదులు ఆర్మీ కాన్వాయ్‌పై కాల్పులు జరిపారు. ఆర్మీ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. కొంతమంది ఉగ్రవాదులు పారిపోయినట్టు ఆర్మీ అనుమానిస్తోంది.



అక్నూర్‌ సెక్టార్‌లో అన్ని ప్రాంతాలను ఆర్మీ జల్లెడ పట్టింది. వారం రోజులుగా ఉగ్రవాదుల దాడులు పెరిగాయి. స్థానికేతరులను టార్గెట్‌ చేస్తూ కాల్పులు జరుపుతున్నారు. దీంతో అప్రమత్తంగా ఉన్న సైన్యం ముగ్గురు టెర్రరిస్టులను కడతేర్చింది. అధునాతన ఆయుధాలతో పాటు డ్రోన్లను ఉపయోగిస్తూ భద్రతా బలగాలు ముందుకు కదులుతున్నాయి.  తొలిసారి ప్రత్యేక వాహనాలను కూడా కూంబింగ్‌లో ఉపయోగించారు.  భారత సరిహద్దులో చొరబడ్డ ఉగ్రవాదులు పెద్ద ప్లాన్‌తోనే వచ్చారు.  అమెరికాలో తయారైన అధునాతన ఆయుధాలతో దాడికి సిద్దమయ్యారు.



బట్టాల్‌ దగ్గర ఎన్‌కౌంటర్‌ ముగిసిన తరువాత దొరికిన ఆయుధాలను చూస్తే దిమ్మతిరిగింది. గ్రెనేడ్లతో పాటు ఏకే 47 రైఫిళ్లు అక్కడ దొరికాయి. చాలా రోజుల పాటు దాడిని కొనసాగించేందుకు అన్నిరకాల సామాగ్రితో చొరబడ్డారు టెర్రరిస్టులు. వాస్తవానికి తొలిసారి ఈ ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌ జరిగింది. అఖ్నూర్‌ సెక్టార్‌లో ఇది మొదటి ఎన్‌కౌంటర్‌ఎం4 రైఫిల్‌ను గతంలో కూడా వాడారు. ఆ ప్రాంతంలో ఆలయం ఉంది. పేలుడు పదార్దాలను గుర్తిస్తున్నాం. ఆలయాన్ని డ్యామేజ్‌ చేసేందుకు ఎవరు ప్రయత్నం చేయలేదని స్థానిక పోలీసు అధికారి చెప్పారు.



ఆర్మీ కాన్వాయ్‌లో భాగమైన అంబులెన్స్‌ను కూడా ఉగ్రవాదులు టార్గెట్‌ చేస్తూ కాల్పులు జరిపారు. అయితే వెంటనే తేరుకున్న సైన్యం ఎదురుదాడిని ప్రారంభించింది.  ఉగ్రవాదుల ఏరివేతకు ఆర్మీ ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేసి ఉగ్రవాదుల కదలికలపై డేగకన్ను పెట్టారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: