లోకేశ్ ని వ్యూహాత్మకంగా వాడుతున్న చంద్రబాబు? ఈ విషయంలో మెచ్చుకొని తీరాల్సిందే?

టీడీపీ యువనేత, మంత్రి నారా లోకేశ్ చాలా యాక్టివ్ గా ఉన్నారు. పార్టీతో పాటు ప్రభుత్వంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. మరో వైపు కేంద్ర పెద్దలతో కూడా సమన్వయం చేసుకుంటున్నారు. తాజాగా ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. 40 నిమిషాల పాటు చర్చించారు. రాష్ట్రానికి సంబంధించి కీలక ప్రాజెక్టులతో పాటు రాజకీయ అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నారు.


కేంద్ర మంత్రితో సహృద్భావ వాతావరణంలో చర్చలు కొనసాగాయని లోకేష్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. అయితే ప్రధానంగా రాజకీయ అంశాలు వారి మధ్య ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. ఇటీవల చంద్రబాబు హర్యానాలో పర్యటించిన సంగతి తెలిసిందే.  బిజెపి ఆహ్వానం మేరకు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు.


అనంతరం ఎన్డీఏ భాగస్వామ్య పక్ష పార్టీల సమావేశంలో సైతం పాల్గొన్నారు.  జమిలీ ఎన్నికలకు సైతం మద్దతు ప్రకటించారు.  2029 ఎన్నికల్లో సైతం ఆ రెండు పార్టీలతో పొత్తు ఉంటుందని.. అందుకు అనుగుణంగా నడుచుకోవాలని పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు. రెండు పార్టీలతో సమన్వయం చేసుకునే బాధ్యత మీదేనంటూ సూచించారు.  చంద్రబాబు తరచు కేంద్ర పెద్దలను ప్రశంసిస్తున్నారు.


రాష్ట్రంలో నామినేటెడ్ పదవులతో పాటు రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవులను భర్తీ చేయాల్సి ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సైతం పెండింగ్లో ఉంది. అమరావతి రాజధాని నిర్మాణంతో పాటు పోలవరంపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు.  అందుకే నామినేటెడ్ పదవుల బాధ్యతను లోకేష్ తీసుకున్నట్లు తెలుస్తోంది. కేంద్ర పెద్దలతో ఈ మేరకు చర్చలు జరిపినట్లు సమాచారం.


గతంలో చంద్రబాబు అరెస్టు సమయంలో సైతం లోకేష్ ఢిల్లీలో పావులు కదిపారు. మూడు పార్టీల మధ్య పొత్తుకు అదే టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. అప్పటివరకు లోకేష్ విషయంలో అనేక రకాల అభ్యంతరాలు ఉండేవి. కానీ తండ్రి అరెస్టు విషయంలో లోకేష్ వ్యవహరించిన తీరు అప్పట్లో ఆకట్టుకుంది.  ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో పాటు ప్రభుత్వంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. మూడు పార్టీల మధ్య సమన్వయానికి కృషి చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: