అదానీ రూ.100 కోట్లతో ఇరకాటంలో కాంగ్రెస్ ప్రభుత్వం?

భారత దిగ్గజ పారిశ్రామిక వేత్తల్లో రిలయన్స్ ఇండస్ర్టీస్ అధినేత ముకేశ్ అంబానీ మొదటి స్థానంలో ఉన్నారు. తర్వాతి స్థానంలో గౌతమ్ అదానీ ఉన్నారు. ఇటీవల వరద బాధితులకు రూ.25 కోట్లు విరాళంగా ఇచ్చిన అదానీ.. ఇప్పుడు మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీకి భారీ విరాళం ప్రకటించారు.


అదానీ గ్రూప్ నకు చెందిన అదానీ ఫౌండేషన్ ద్వారా రూ.100 కోట్లు భారీ విరాళం ఇచ్చారు. ఈ మేరకు చెక్కును తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి శుక్రవారం హైదరాబాద్ లో కలిసి అందజేశారు. ఇందులో అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతం అదానీ, ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ విషయాన్ని సీఎంవో సోషల్ మీడియా వేదిక ద్వారా వెల్లడించింది.  సీఎంకు చెక్కు అందించే ఫోటోలను షేర్ చేసింది. సడెన్ గా అదానీ ఆర్థిక సాయంపై ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది.


వరద బాధితులకు కేవలం రూ.25 కోట్లు ఇచ్చిన బడా పారిశ్రామిక వేత్త అదానీ.. తెలంగాణలో ఇంకా ఏర్పాటు కానీ స్కిల్ యూనివర్శిటీకి మాత్రం ఉత్త పుణ్యానికే రూ.100 కోట్లు విరాళం ఇవ్వడం వెనుక కారణం ఏమై ఉంటుందా పలువురు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. ఎలాంటి సడీ సప్పుడు లేకుండా సడెన్ గా సీఎం ఆఫీస్ లో ప్రత్యక్షం అయి  భారీ విరాళాన్ని అందించడం వెనుక ఆంతర్యం ఏమిటా అని ఆలోచన చేస్తున్నారు.


దీనిపై రాజకీయ విశ్లేషకులు స్పందిస్తూ.. దేశంలో ఉత్తర భారత దేశంలోని తనకు అనుకూలంగా ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలు నుంచి రాయితీ పొంది అదానీ వ్యాపారం చేస్తున్నారు. ఇక తెలంగాణలో తన వ్యాపారాన్ని విస్తరింపజేయాలనే ఉద్దేశంతో ఈ వ్యూహ రచన చేసినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే దిల్లీలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. సీఎం కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ఈ క్రమంలో రూ.100 కోట్ల చెక్కుతో హైదరాబాద్ లో  ల్యాండ్ అయినట్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. అదానీ విషయంలో ప్రతిపక్షాలు ఏ విధంగా స్పందిస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: