రాహుల్ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేసిన నారా లోకేశ్! హింట్ ఇస్తున్నారా?

నారా లోకేశ్ ని ఇప్పుడు పప్పు అని ఎవరైనా అంటే వారినే పప్పు అనుకోవాలి. అత్యంత ప్రతికూల పరిస్థితుల నుంచి లోకేశ్ ఒక రాజకీయ నేతగా రూపాంతరం చెందారు. తనను తాను ఆయన తీర్చిదిద్దుకున్నారు. చంద్రబాబు వంటి అపర చాణుక్యుడు వారసుడు అన్న బరువైన ట్యాగ్ తో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన నారా లోకేశ్… చంద్రబాబు వారసత్వమే ఆయనకు మోయలేని బరువుగా మారింది.


చంద్రబాబుని చూసిన కళ్లతో లోకేశ్ ని చూసి పొలిటికల్ ఫీల్డ్ కి ఆయన పనికిరారు అని అన్న వారు .. ఆయనకు పప్పు అనే ట్యాగ్ లైన్ కూడా ఇచ్చారు. కానీ లోకేశ్ ని ఈ రోజు చూస్తే.. ఆయనలో వచ్చిన పరిపక్వత కానీ ఆయన ఆలోచన విధానం కానీ మీడియాను ఫేస్ చేస్తున్న తీరు కానీ.. పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడే విధానంతో పాటు పార్టీ కేడర్ కి ఇస్తున్న భరోసా ఇవన్నీ లోకేశ్ ని ఫ్యూచర్ ఆఫ్ పాలిటిక్స్ అని చెప్పడంలో తప్పు లేదు అంటున్నారు.


లోకేశ్ లో అన్నీ ఎమోషన్స్‌ ఉన్నాయి. వాటిని వెలికితీసి సందర్భం అరుదుగా వస్తుంది. అలా ఏపీ ఐటీ మంత్రిగా లోకేశ్ ని టైమ్స్ ఆఫ్ నౌ సంస్థ చేసిన ఇంటర్య్వూలో ఎన్నో చిక్కు ప్రశ్నలతో ఆయన్ను టార్గెట్ చేసింది. అయితే లోకేశ్ ఎక్కడా తొణకకుండా బెణకకుండా పూర్తి చతురతతో సమయ స్ఫూర్తిగా బదులిస్తూ.. తనలోని రాజకీయ పరిణితి నిరూపించుకున్నారు.


రాహుల్ గాంధీ మీద లోకేశ్ అభిప్రాయాన్ని అడిగనప్పుడు ఆయన పాదయాత్ర రాహుల్ గాంధీని మార్చిందని తాను నమ్ముతున్నట్లు చెప్పుకొచ్చారు. అదే సమయంలో తాను రాహుల్ తాను అంగీకరించని విషయాలు కూడా కొన్ని ఉన్నాయని అన్నారు. రాహుల్ ది కాంగ్రెస్ ది మితిమీరిన సంక్షేమ అజెండా అని అన్నారు. ఈ దేశానికి సంక్షేమం అలాగే అభివృద్ధి రెండింటినీ బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుందని అన్నారు. దేశాన్ని నడిపించే సామర్థ్యం రాహుల్ లో ఉందా అన్న ఒక ప్రశ్నకు లోకేశ్ బెటర్ ఆన్సర్ ఇచ్చారు. కాలమే జవాబు చెప్పాలి అని చాలా తెలివిగా తనలోని చతురతను ఈ విధంగా చూపించారు నారా లోకేశ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: