జమ్మూలో కూటమి గెలిచినా అధికారం మాత్రం మోదీదే?

దేశంలో రెండు రాష్ట్రాల ఫలితాలు ప్రజలందరకీ ఉత్కంఠ కలిగించాయి. దేశాన్ని ఏలే బీజేపీ ఈ రెండు రాష్ట్రాల్లో ఎలా తన రాజకీయ ప్రదర్శన చేస్తుంది అన్నది అందరిలోను ఆసక్తి బాగా పెరిగిపోయింది. దీనికి కారణం కశ్మీర్ లో ఆర్టికల్ 370 ని రద్దు చేసిన తర్వాత తొలిసారి జరిగిన ఎన్నికలు.


అంతే కాదు దేశంలోనే మిగిలిన రాష్ట్రాల్లో కంటే ఎక్కువగా కశ్మీర్ అభివృద్ధి కోసం కేంద్రం గత అయిదేళ్లలో ప్రత్యేక గ్రాంట్ ను విడుదల చేసి మరీ ఖర్చు చేసి అభివృద్ధి పరిచింది. దీంతో అక్కడ అభివృద్ధి కళ్లముందు కనిపిస్తుంది. దీనిని స్థానిక ప్రజలు కూడా అంగీకరిస్తున్నారు. అయితే కశ్మీర్ లోయలో మాత్రం బీజేపీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. జమ్మూలోనే ఉన్న 43 సీట్లలో బీజేపీ గెలుచుకుంటూ వచ్చింది. అలా 29 సీట్ల దాకా అతి పెద్ద పార్టీగా ఉంది. ఇక కశ్మీర్లో మొత్తం 90 సీట్లు ఉన్నాయి. మరో అయిదుగురిని లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేస్తారు. వారంతా బీజేపీకి చెందిన వారే ఉంటారు అనడంలో సందేహం లేదు. అలా బీజేపీ ఈ సారి బలమైన ప్రతిపక్షంగా కశ్మీర్ లో ఉండనుంది.


ఇక నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి మ్యాజిక్ ఫిగర్ ని సాధించింది. అయితే కశ్మీర్ జమ్మూను కేంద్రం పాలిత ప్రాంతాలుగా కేంద్రం ఉంచింది. దాంతో కశ్మీర్లో పరిస్థితి కూడా అచ్చం దిల్లీ మాదిరిగానే ఉంటుంది. ఇంకా ఎక్కువగానే ఉంటుందనే చెప్పొచ్చు.


లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా కేంద్రం తన పరోక్ష అధికారాలను చెలాయించే అవకాశాలు కూడా ఉన్నాయి. 2019లో జమ్మూ కశ్మీర్ రాష్ట్ర హోదా రద్దు చేసి కేంద్ర పాలిత ప్రాంతంగా చేసి కేంద్రం చట్టం చేసింది. ఇదే ఇప్పుడు బీజేపీకి అడ్వాంటేజ్ గా మారబోతుంది. అక్కడ ప్రజలు నెగ్గించిన ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. కానీ అదే సమయంలో అపరిమితమైన అధికారాలు మాత్రం కేంద్రం చేతిలో ఉంటాయి. లెఫ్టినెంట్ గవర్నర్ కేంద్ర పాలిత ప్రాంతంలో కీలకంగా ఉంటారు అనే సంగతి తెలిసిందే. దీంతో కూటమి ప్రభుత్వం పరిమిత అధికారాలతో పెత్తనం చెలాయించాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: