సినీ పరిశ్రమపై రేవంత్ రెడ్డి పగబడతారా? ఇక వారికి కష్టకాలమేనా?

తెలుగు సినీ పరిశ్రమపై సీఎం రేవంత్ రెడ్డి మండి పడుతున్నారు. ప్రభుత్వానికి సహకారం అందించాల్సిన సమయంలో ఏ  స్పందనా లేకుండా మౌనంగా ఉండి.. ఇప్పుడు కొండా సురేఖపై మూకుమ్మడిగా ఖండన ప్రకటనలిస్తుండటంతో సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.



హైదరాబాద్ డ్రగ్స్ వాడకం ఎక్కువగా ఉందని.. డ్రగ్స్ వాడొద్దంటూ యువతకు సూచించే విధంగా సినీ రంగంలోని సెలబ్రటీలు ముందుకు రావాలని వారిని చైతన్య పరచాలని కోరితే ఇంత వరకు ఒక్కరూ కూడా స్పందించలేదు. కేవలం చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ లు మాత్రమే వీడియోలు చేసి విడుదల చేశారు. టికెట్ ధరలను పెంచుకోవడానికి మాత్రం ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తున్న సినీ ప్రముఖులు నంది అవార్డుల స్థానంలో గద్దర్ పేరుతో అవార్డులిస్తామంటే ఒక్కరూ కూడా ముందుకు రాలేదు. దీనిపై తమ స్పందనను తెలియజేయలేదు.


మరోవైపు ఏపీ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల్లో సినీ పరిశ్రమకు ఎక్కడా సహకారం అందలేదు. అయితే గత పది ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి సినీ పరిశ్రమకు సత్సంబంధాలే ఉండేవి. అధికారంలో వచ్చిన రేవంత్ రెడ్డి సైతం సినీ పరిశ్రమకు అనుకూలంగానే ఉన్నారు. అయితే హైడ్రా కూల్చివేతల్లో భాగంగా అగ్ర హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చేశారు. దీనిపై సినీ పరిశ్రమ నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రాకపోయినా మౌనంగా మాత్రం ఉన్నారు.


కొండా సురేఖ కేటీఆర్ పై వ్యాఖ్యలు చేసే క్రమంలో నాగార్జున కుటుంబాన్ని, సమంగతను లాగారు. దీంతో సినీ పరిశ్రమ మొత్తం ఒక్కసారిగా ప్రభుత్వంపై తిరగబడింది. సురేఖ చేసిన వ్యాఖ్యలపై అందరూ తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. దీనిపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్ గౌడ్ స్పందిస్తూ ఆమె క్షమాపణలు చెప్పాలని ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలని సినీ పరిశ్రమకు విజ్ఞప్తి చేశారు. అయినా వివాదం సద్దుమణగలేదు. అయితే ఈ విషయంలో పవన్ కల్యాణ్, బాలకృష్ణలు స్పందించలేదు. ఇక ఇప్పటి నుంచి పరిశ్రమకు సానుకూలంగా ఉండాల్సిన అవసరం లేదని రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: