చంద్రబాబు ఎత్తులతో జగన్ చిత్తవుతారా.. నిలబడతారా?

సీఎం చంద్రబాబు నాయుడుకి ఐదు పదుల రాజకీయ అనుభవం ఉంది. ఆయనకు ఒకరు వ్యూహాలు నేర్పాల్సిన పని లేదు. ఆయనకు స్ర్టాటజిస్ట్ అవసరం లేదు. ఎప్పుడు ఏది చేయాలో రాజకీయంగా ఆయనకు తెలిసినంత మరెవరకీ తెలియదు అంతే అతిశయోక్తి కాదేమో. ఏది ఏమైనా ఆయన ఒక వ్యూహం ప్రకారం ముందుకు వెళ్తారు. ఎప్పుడూ బిజీగా ఉంటారు. కార్యాలయానికే పరిమితం కాకుండా.. ప్రజల వద్దకు వెళ్తుంటారు.

అయితే ఆయన రాజకీయం చేస్తారు తప్ప.. వ్యక్తిగతంగా ఎవర్నీ టార్గెట్ చేయరు. ప్రతీకార రాజకీయాలకు ఆయన కొంచెం దూరంగానే ఉంటారు.  గతంలో వైఎస్సార్, చంద్రబాబు ప్రత్యర్థులుగా ఉన్న వ్యక్తిగతంగా ఇద్దరూ పంతానికి పోలేదు.  కేవలం రాజకీయ వైరం మాత్రమే ఉంది.  కానీ ఈ సారి జగన్, చంద్రబాబు లు ఇద్దరూ వ్యక్తిగతంగా బద్ధ శత్రువుల వలె తలపడుతున్నారు. తను జైలు పాలవ్వడానికి చంద్రబాబే కారణం అని జగన్ భావించారు.

రాజకీయంగా అణగదొక్కాలని భావించే చంద్రబాబు ఎల్లో మీడియా అండతో తనపై బురదజల్లే ప్రయత్నాలు రాశారు అని జగన్ కోపం.  అందుకే వైసీపీ అధికారంలోకి రాగానే ఏదోలా చేసి కనీసం 50 రోజులు అయినా ఆయన్ను జైలుకి పంపించారు. దీంతో పాటు 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఘోరంగా అవమానించారు. ఇప్పుడు చంద్రబాబు వంతు వచ్చింది. ఈ సారి జగన్ కు కనీసం ప్రతిపక్ష హోదా రానివ్వకుండా చంద్రబాబు ఓడించారు.

ఇప్పుడు తనకు ప్రతిపక్ష హోదా కల్పించండి.. సెక్యూరిటీ పెంచండి అంటూ జగన్ మాటిమాటికి కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి  ఏర్పడింది. మరి ఇప్పుడు చంద్రబాబు జగన్ ని ఏం చేస్తారు. రాజకీయంగా ఎలా బలహీనం చేస్తారు. వైసీపీకి క్యాడర్ బలంగా ఉంది. అందువల్ల వైసీపీ అధినేత చుట్టూ ఉన్న ఆర్థిక మూలాలను దెబ్బకొడతారు. సీనియర్ లీడర్లను వివిధ కేసుల్లో ఇరికించి వారిని ఇబ్బంది పెడతారు. గతంలో జగన్ చేసింది కూడా అదే. చంద్రబాబు ఆర్థిక మూలాలను దెబ్బకొట్టారు. కానీ తెలివిగా ఆయన వాటిని తిప్పికొట్టి ఎన్నికల్లో నిలబడ్డారు. మరి జగన్ అలా నిలబడతారా.. లేక చేతులెత్తేస్తారా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: