చంద్రబాబు ట్రాప్‌లో వైసీపీ పడిపోతోందా?

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగా లేదు అని సీఎం చంద్రబాబు పదే పదే ఎందుకు చెబుతున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో పథకాలు అమలు చేయలేమని అనుమానం ఎందుకు వ్యక్తం చేస్తున్నారు. దీని వెనుక వ్యూహం ఉందా. లేకుంటే వైసీపీని ఇరికించే ప్రయత్నం ఏదైనా జరగుతుందా? మరి వైసీపీని ట్రాప్ చేస్తున్నారా? పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది.

ఎన్నికల్లో చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించారు. వాటికి మించి మరికొన్ని హామీలు ఇచ్చారు. కానీ ఇంత వరకు వాటిని అమలు చేయలేదు అధికారంలోకి వచ్చి 50 రోజులు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో పథకాలను అమలు చేయడం లేదు. పైగా వరుసగా శ్వేత పత్రాలను విడుదల చేస్తున్నారు. వీటి ద్వారా రాష్ట్ర  ఆర్థిక పరిస్థితి ఏమంత బాగా లేదు అనే సందేశాన్ని ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు.

వాస్తవానికి ఆగష్టు 15 నుంచి పలు పథకాల అమలుకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఇదే సమయంలో ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా తాను పథకాలను అమలు చేస్తున్నాననే క్రెడిట్ కొట్టేయడం కోసం చంద్రబాబు వ్యూహాలు పన్నుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైసీపీ హయాంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారింది అన్న అంశమే ప్రజల్లోకి బలంగా వెళ్తోంది. ఇది తప్పకుండా వైసీపీకి ఎంతో కంత మైనస్ చేస్తుంది.

దీనిని వైసీపీ గుర్తించలేకపోతే చంద్రబాబు ట్రాప్ లో ఆ పార్టీ పడినట్లే. ఇప్పటికే పెంచిన పింఛన్లను వరుసగా రెండో నెల కూడా అందించారు. వైసీపీ రాష్ట్రాన్ని ఆర్థికంగా దిగజార్చినా తాను సెట్ చేసి పథకాన్ని అమలు చేసిన విషయాన్ని ఇప్పుడు చంద్రబాబు ప్రస్తావిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లు ప్రారంభించేందుకు చకచకా ఏర్పాట్లు సాగుతున్నాయి. మరో వారంలో ఇవి ప్రారంభం కానున్నాయి. వీటితో పాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు ప్రభుత్వం ఒడిఒడిగా అడుగులు వేస్తోంది. మొత్తంగా వీటిని అమలు చేస్తూ.. జగన్ రాష్ట్రాన్ని ఎన్ని రకాలుగా దివాళా తీయించినా.. ప్రజల కోసం తాను ఈ పథకాలను అమలు చేస్తున్నా అని చెప్పి సీఎం చంద్రబాబు, టీడీపీ నేతలు ప్రచారం చేస్తారు. ఇది చంద్రబాబు లెక్క అని విశ్లేషకులు అభిప్రాయడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: