భారత్‌ను కమ్మేస్తున్న విదేశీ శరణార్థులు? భయంకర నిజాలివిగో?
కాగా భారత్ లోకి కూడా ఇలానే చాలా మంది విదేశీయులు శరణార్థులుగా వచ్చి.. బతిమిలాడో.. ఏదోలా బతుకుతాం అని చెప్పి భారత పౌరసత్వం పొందేందుకు యత్నిస్తున్నారు. వీరికి కొన్ని రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకు కోసం అండగా ఉంటున్నాయి. బంగ్లాదేశ్, బర్మా దేశాల నుంచి రోహ్యింగాలు దర్జాగా భారత్ కి వచ్చేస్తున్నారు. కొంతమంది ముఠాలుగా ఏర్పడి వారి దగ్గర డబ్బులు తీసుకొని భారత్ కు తీసుకొస్తున్నారు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు ఓ కొత్త విషయాన్ని కనిపెట్టారు.
యూపీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు ఓ గ్యాంగును పట్టుకున్నారు. వీరిలో రోహ్యింగాలు, బంగ్లాదేశీలయులు అధికంగా ఉన్నారు. త్వరలో రాయ్ బరేలీ లోక్ సభ నియోజకవర్గంలో ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో వీరందరనీ ఇక్కడికి తరలిస్తున్నారు. వీరి వద్ద నుంచి పోలీసులు 60 నుంచి 70 వేల ఫేక్ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటన్నింటిని ఇంతకు ముందే ఇక్కడకి వచ్చిన రోహ్యింగాలు తయారు చేయడం గమనార్హం.
దీనిపై పోలీసులు పలు విషయాలను వెల్లడించారు. విజయ్ యాదవ్ అనే వ్యక్తి ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించి బంగ్లాదేశీయులను, బర్మా నుంచి రోహ్యింగులను ఇండియాకు తరలిస్తున్నాడు. ఆ తర్వాత ఈ నకిలీ ధ్రువ పత్రాలతో భారత్ పౌరసత్వం ఇచ్చేలా కుట్రలు పన్నుతున్నాడు. తదనంతరం ఓటర్ ఐడీ కూడా ఇప్పించి ఈ దేశ పౌరులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ గుట్టును ఉత్తర్ ప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారులు బట్టబయలు చేశారు. ఇప్పటి వరకు ఎంత మంది ఇలా వచ్చారు. ఎంత మంది భారతీయులుగా మారారు అనేది తెలియదు. ఇది ఆందోళన కలిగించే విషయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.