బాబుకు చెక్‌ పెట్టేందుకు జగన్‌ చతుర్ముఖ వ్యూహం?

ఏపీ రాజకీయాలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవుతున్నాయి. ఏపీలో భవిష్యత్తు రాజకీయాలు అంచనా వేసి జగన్ పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా కూటమికి ప్రత్యామ్నాయం తానేనటి చాటి చెప్పే సంకేతాలు పంపుతున్నారు.  జగన్ దిల్లీలో దీక్ష చేసి తాను అనుకున్నది సాధించగలిగారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం నుంచి జగన్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ప్రజల వద్దకు వస్తున్నారు. ఇదే సమయంలో చతుర్ముఖ వ్యూహం అనుసరిస్తున్నారు.
ఈ సారి అసెంబ్లీలో జగన్ అడుగు పెట్టేలేదు.  వచ్చే నెలలో బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. అప్పుడు అసెంబ్లీకి వెళ్తే మాట్లాడటానికి అవకాశం ఇవ్వాలి. ఒకవేళ కూటమి నేతలు మైక్ ఇవ్వకపోతే నాకు అవకాశం ఇవ్వలేదు అందుకే అసెంబ్లీకి వెళ్లడం లేదని చెప్పి జనంలోకి వెళ్తారు. ఇక రెండో దానికి వస్తే జాతీయ స్థాయిలో ఉన్న రెండు కూటములకు సంకేతాలు ఇవ్వడం.

ప్రస్తుతం జగన్ ఏ పక్షం తరఫున లేరు. స్వతంత్రంగా ఉన్నారు. కానీ బీజేపీకి సపోర్డుగా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఏపీలో తనను ఇబ్బంది పెడితే వెళ్లి ఇండియా కూటమిలో చేరతాను అనే సంకేతాలను బీజేపీ పెద్దలకు దిల్లీలో ధర్నా ద్వారా పంపినట్లే అయింది. ఇదే సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని విమర్శించి బీజేపీ అధిష్ఠానం దృష్టిలో పడేలా చూసుకున్నారు.
మరోవైపు ఇదే సమయంలో కాంగ్రెస్ కు కూడా హెచ్చరికలు పంపారు. ఆ పార్టీ భాగస్వామ్య పక్షాలన్నీ వైసీపీకి మద్దతు పలికాయి. ఇప్పుడు మాకు సహకారం అందిస్తే కూటమిలో చేరేందుకు తాను సిద్ధం. భవిష్యత్తులో మా మద్దతు మీకు అవసరం ఉంటుందని అని చెప్పకనే చెప్పారు. నాలుగోది షర్మిళకు చెక్ పెట్టడం. చంద్రబాబు, రాహుల్, రేవంత్ ఒక్కటే అని చెప్పడం ద్వారా అటు ఏపీలోను, ఇటు తెలంగాణలోను ఎంతో కంత డ్యామేజ్ జరుగుతుంది. ఎందుకు అంటే 2018లో టీడీపీ, కాంగ్రెస్ పొత్తును ప్రజలు తిరస్కరించారు. చంద్రబాబు, రేవంత్ గేమ్ ఆడుతున్నారని తెలంగాణ ప్రజలు భావిస్తే.. 2028లో అవే ఫలితాలు పునరావృతం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి షర్మిళను అదుపులో పెట్టాలి. ఈ నాలుగు వ్యూహాలతో జగన్ ముందకు వెళ్తున్నారు.  మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

cbn

సంబంధిత వార్తలు: