టీడీపీ ఎమ్మెల్యేలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌ చెప్పిన చంద్రబాబు?

ఏపీ అసెంబ్లీ చరిత్రలో సరికొత్త రికార్డు నమోదు అయింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో గత ప్రభుత్వంలో జరిగిన శాంతి భద్రతలపై సీఎం చంద్రబాబు శ్వేత పత్రం విడుదల చేశారు.  ఈ సందర్బంగా ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యేల్లో 80 శాతం మందిపై కేసులు ఉండటం విశేషం.

అదీ కూడా జగన్ ప్రభుత్వం పెట్టిన కేసులే కావడంతో అసెంబ్లీలో సరికొత్త రికార్డు నమోదు అయినట్లయింది. శ్వేత పత్రంపై చర్చ సందర్భంగా జగన్ ప్రభుత్వం పెట్టిన కేసుల అంశం ప్రస్తావనకు వచ్చింది. జగన్ హయాంలో అక్రమ బాధితులు నిల్చోవాలని చంద్రబాబు కోరారు. దాదాపు ఎమ్మెల్యేలు అంతా లేచి నిలబడటం గమనార్హం. కొద్ది మంది మాత్రమే తమపై కేసులు లేవని తెలిపారు. దీంతో అందరం జగన్ బాధితులమేనంటూ చంద్రబాబు సెటైర్లు వేశారు.
ఇక తనపై 17 కేసులు ఉన్నాయని, డిప్యూటీ సీఎం పవన్ పై ఏడు కేసులు పెట్టారని, చివరకు స్పీకర్ ని కూడా వదల్లేదని పేర్కొన్నారు. వీరితో పాటు టీడీపీ నేతలు జేసీ ప్రభాకర్ రెడ్డిపై 67 కేసులు, చింతమనేని ప్రభాకర్ పై 48 కేసులు, పులివర్తి నానిపై 31 కేసులు, లోకేశ్, అయ్యన్నపాత్రుడిపై  చెరో 17కేసులు,  అనితతో పాటు పలువురు టీడీపీ నేతలు అమరావతి రైతులపై అనేక కేసులు నమోదు అయ్యాయి.
అయితే ఇప్పుడు తెలుగుదేశం నాయకులు, ఎమ్మెల్యేలపై కేసుల  ఎత్తివేతపై రాష్ట్ర హోం శాఖ కసరత్తు ప్రారంభించింది. వాటిల్లో హత్యా, హత్యాయత్న కేసులైతే రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవడానికి కుదరదు. ఇతరత్ర ధర్నాలు, ఆందోళనలు లాంటివి విత్ డ్రాలు చేసుకోవచ్చు. లేదంటే త్వరగా ఈ కేసులు తేలేలాగా అంటే.. వీటి నుంచి బయట పడాలంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసుకొని ఈ కేసుల నుంచి బయట పడొచ్చు. ఎంపీలు, ఎమ్మెల్యేలే కాక క్షేత్రస్థాయిలో అనేక మంది నాయకులపై కేసులు ఉన్నాయి. వీరందరికీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉపశమనం కలిగించకపోతే..  డబ్బులు వృథా అవుతాయి. కార్యకర్తలకు న్యాయం జరగదు. వేగంగా వీటన్నింటిని క్లోజ్ చేసేలా అడుగులు పడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: