మోదీని దెబ్బతీస్తున్న ఆ రెండు కీలక అంశాలు.. జాగ్రత్త పడకపోతే ఇంతే సంగతులు?

కేంద్ర బడ్జెట్ ఎలా ఉంది. సహజంగానే బడ్జెట్ పై ప్రతిపక్షాలు విమర్శించాయి. ఎవరు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్న వాళ్లు తీవ్రంగా దానిని ఖండిస్తారు. అందులో వ్యతిరేకించడానికి ఏమీ లేదు. ఇది ఎన్నికల తర్వాత వస్తున్న మొట్ట మొదటి బడ్జెట్. దీనిపై అంచనాలు ఎక్కువగా వేసుకున్నారు. ఐటీ రిటర్న్, సంక్షేమ పథకాలు ప్రవేశ పెడతారని ఊదరగొట్టారు.

ఎన్నికల తర్వాత వచ్చిన బడ్జెట్ లోను మోదీ సర్కారు ఆలోచనలే అమలు అవుతాయి. ఎన్నికల ముందర బడ్జెట్ లో మోదీ ఎలాంటి తాయిలాలను ప్రకటించలేదు. ఈస ఆరి ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తే పూర్తిగా అభివృద్ధిపైనే ఫోకస్ పెట్టారు. ఆర్థిక క్రమశిక్షణ పాటించారు. పాత బడ్జెట్ లో ద్రవ్య లోటు 5.1 నుంచి 4.9 కి తగ్గించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిర్ణయించారు.

పదేళ్ల ప్రభుత్వం కాబట్టి ఎన్డీయేపై ప్రజల ఆశలు రెట్టింపు అవుతున్నాయి. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇన్ కం ట్యాక్స్ ను పెంచింది కానీ.. తగ్గించలేదు. కానీ గత రెండు సార్లుగా మోదీ ప్రభుత్వం దీనిని తగ్గించింది. అయినా ప్రజలు సంతృప్తి చెందడం లేదు. ప్రస్తుత బడ్జెట్ పై ఆర్థికపరంగా అసంతృప్తి నెలకొంది. నేరుగా ప్రజలకు ప్రయోజనం చేకూర్చే పథకం ఒక్కటీ కూడా లేదు.

మధ్య తరగతిలో ఒక్కో రూపాయి కూడబెట్టుకునే వారు చిన్న చిన్న షేర్లలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. వాటిపై కూడా పన్ను విధించారు. మొత్తం మీద మధ్య తరగతి వారిపై అన్ని రకాలుగా పన్ను పడుతోంది. వస్తువులపై ఎలాగూ పన్ను ఉంటుంది.  వీరు దాచుకునే చిన్నా చితకా మొత్తాలపై కూడా పన్ను చెల్లించాల్సి వస్తోంది. దీంతో పాటు రైల్వే బడ్జెట్ కూడా మధ్య తరగతి, నిరుపేదలు పెదవి విరుస్తున్నారు. ఎందుకు అంటే గతంలో బస్సు ప్రయాణం కంటే రైల్వే ఛార్జీలు చాలా తక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు విమాన టికెట్ ధరతో సమానంగా కొన్ని రైలు టికెట్లు ఉన్నాయి. వసతుల కోసం అంటూ రైల్వే ఛార్జీలను పెంచుతున్నారు. ఈ అంశాల కారణంగా మోదీపై అసంతృప్తి పెరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: