కాళేశ్వరం.. కేసీఆర్ చేసిందే రైటా.. నిపుణులు మాటేంటి?

కేసీఆర్ చేపట్టిన సాగు నీటి ప్రాజెక్టులను తప్పు పట్టి.. వీటినే ప్రచార అస్త్రాలుగా చేసుకున్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం కాళేశ్వరం కమీషన్ల కోసమే నిర్మించారు అని చెప్పి దానిపై విచారణ చేపట్టిన  కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కాలయాపన చేస్తోందని బీఆర్ఎస్ విమర్శించింది. ఒక వైపు మేడిగడ్డ పునాదిని బలపరిచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం అంటూనే.. మేడి గడ్డ వద్ద మట్టి పరీక్షలు సాధ్య పడలేదు అంటున్నారు.  ఈ ఏడాది మే 5న నివేదిక ఇచ్చిన ఎన్డీఎస్ఏ వర్షాకాలం వరదలు రాకముందే.. జులై మొదటి వారంలోపు పలు సాంకేతిక పరీక్షలు నిర్వహించాలని ఆ నివేదికలో పేర్కొంది.

ఎన్డీఎస్ఏ సూచనలతో.. జూన్ రెండో వారంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు సీడబ్ల్యూపీఆర్ఎస్, సీఎస్ఎంఆర్ఎస్లతో పాటు సాంకేతిక పరీక్షలు చేయించాలని తెలంగాణ  ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే సమయంలో రెండు సంస్థలు సాంకేతిక పరీక్షలకు ఉపక్రమించే సమయానికి వరద రావడంతో టెస్టులు ఆపేసినట్లు ఆశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

అయితే ఇది గమనార్హమని.. ఈ వైఫల్యానికి ఎన్డీఎస్ఎ వైఖరి కారణం అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. శంఖంలో పోస్తేనే తీర్థం అవుతుందన్నట్లు నేషనల్ డ్యాం సేఫ్టీ వారు చెప్పినవే పరిష్కారాలు అని ప్రభుత్వం కూడా భావించి రాష్ట్ర ఇంజినీర్లను ముందుకు సాగనివ్వడం లేదని విమర్శించింది.

గోదావరికి వరదలు రాకముందే బ్యారేజీ సరైన రక్షణ చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం ఎన్డీఎస్ఏ నివేదిక కోసం ఎదురు చూస్తూ నాలుగు నెలల విలువైన కాలాన్ని వృథా చేసిందని.. ఇప్పుడేమో వరదల కారణంగా పరీక్షలు ఆపేశామని చెప్పడం బాధ్యతా రాహిత్యం కాదా అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. గత ప్రభుత్వంపై , తెలంగాణ ఇంజినీర్లపై బురదజల్లే ప్రయత్నమే తప్ప బ్యారేజీ పునరుద్ధరణకు నిర్మాణాత్మక సూచనలు చేయడంలో నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ దారుణంగా విఫలం అయిందని ఆయన ఆరోపించారు. వారి నుంచి నివేదిక తెప్పించుకోవడంలో ప్రభుత్వం కూడా అలసత్వం వహించింది అని పేర్కొన్నారు. ఈ వరదల్లో మేడిగడ్డ బ్యారేజీకి ఏదైనా నష్టం వాటిల్లిదే ప్రభుత్వానిదే బాధ్యతన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: