చంద్రబాబు రాంగ్ కేబినెట్‌: నిమ్మలకు ఆ శాఖ అయితే బావుండేది?

నిమ్మలకు సహకార రంగంపై పట్టు
రైతు సమస్యలపై పోరాడిన అనుభవం
సహకారం, వ్యవసాయం ఇస్తే బావుండేది
చంద్రబాబు ఎట్టకేలకు మంత్రులకు శాఖలు కేటాయించారు. మంత్రి వర్గం ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజుల తర్వాత కానీ ఆయన మంత్రులకు శాఖలు కేటాయించలేదు. అయితే.. శాఖల కేటాయింపు చూస్తే.. చంద్రబాబు లాంటి అనుభవజ్ఞుడైన సీఎం ఇలా శాఖలు కేటాయించాడేంటి అన్న అనుమానం రాక మానదు. మంత్రి వర్గ కూర్పు అంటే అనేక సమీకరణాలు చూసుకోవాలి. కేబినెట్‌ కూర్పుతోనే ప్రభుత్వ సమర్థత ఏంటో బయటపడుతుంది.

అయితే.. సమర్థులందరికీ కేబినెట్‌లో అవకాశం కల్పించడం కుదరదు. కొందరికి సత్తా లేకున్నా మంత్రి పదవులు కట్టబెట్టాల్సి ఉంటుంది. ఈ సమీకరణాల సాధనలోనే మంత్రులకు శాఖల కేటాయింపు ఇంత ఆలస్యం జరిగి ఉంటుందన్న భావన నెలకొంది. అయితే గోదావరి జిల్లాకు చెందిన నిమ్మల రామానాయుడికి జల వనరులు అభివృద్ధి శాఖను కేటాయించారు. పోలవరం నిర్మాణం దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు గోదావరి జిల్లా వ్యక్తికి జల వనరుల శాఖ కేటాయించడం కొంత వరకు కరెక్టే అయినా నిమ్మల రామానాయుడు నేపథ్యానికి అది అంత సూట్‌ అయిన శాఖ కాదనే చెప్పాలి.

నిమ్మల రామానాయుడు గతంలో ఓ సహకార సంస్థకు ప్రెసిడెంట్‌గా చేసిన అనుభవం ఉంది. కోఆపరేటివ్‌ సొసైటీల పని తీరుపై పూర్తి అవగాహన ఉంది. ఆ రంగంలో నిమ్మల రామానాయుడుకు మంత్రి పదవి ఇస్తే బావుండేది. అలాగే నిమ్మల రామానాయుడు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు. గోదావరి జిల్లాల్లో జరిగిన అనేక రైతు ఉద్యమాల్లో ఆయన పాల్గొన్నారు. రైతుల సమస్యలను తరచూ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ అనేక పోరాటాలు చేశారు.

ఆ నేపథ్యాన్ని బట్టి చూస్తే.. నిమ్మల రామానాయుడుకు వ్యవసాయ శాఖ కూడా చాలా వరకూ సూట్‌ అయ్యేది. అటు సహకార శాఖ అయినా.. ఇటు వ్యవసాయ శాఖ అయినా కూడా నిమ్మల రామానాయుడుకు బాగా ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పుడు జల వనరుల శాఖ మంత్రిగా చంద్రబాబు అవకాశం ఇవ్వడం ఆయనకు కత్తిమీద సామే అని చెప్పొచ్చు. గోదావరి జిల్లా వ్యక్తిగా ఆయన పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో చురుకైన పాత్ర పోషిస్తారని ఇండియా హెరాల్డ్ ఆకాంక్షిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: