2029లో రాహుల్‌గాంధీ ప్రధాని.. ఖాయమేనా?

కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుతో భారత దేశంలో సార్వత్రిక ఎన్నికల అంకం దాదాపు పూర్తి అయింది. ప్రధానిగా నరేంద్ర మోదీ మూడో సారి ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటికి అయితే మోదీ 3.0 మొదలైంది. గత రెండు సార్లు లేని ప్రత్యేకత ఈ సారి ఎన్నికలకు ఉంది.  గత పదేళ్లుగా ప్రధానిగా మోదీ ఉండగా.. విపక్ష నేత పదవి ఖాళీగా ఉంది. కారణం కాంగ్రెస్ సహా మరే ఇతర పార్టీ కూడా లోక్ సభ లో తగిన సీట్లు సాధించలేకపోయింది. లోక్ సభ లో మొత్తం 543 స్థానలు ఉండగా. ఇందులో పదో వంతు అంటే 54 స్థానాలు సాధించిన పార్టీకి సభలో ప్రతిపక్ష హోదా లభిస్తుంది.

ఇక కాంగ్రెస్ విషయానికొస్తే 2014లో 44 సీట్లు.. 2019లో కాస్త మెరుగుపడి 52 స్థానాలు సాధించిది. ప్రతిపక్ష హోదాకి రెండు సీట్ల దూరంలో నిలిచిపోయింది. ఇక యూపీలో 80 సీట్లు ఉండటంతో సమాజ్ వాదీ పార్టీకి మినహా మరే ఇతర పార్టీకి 50కి పైగా స్థానాలు వచ్చే అవకాశం లేదు. ఈ సారి ఇండియా కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేసినా అధికారానికి కొద్ది దూరంలో నిలిచిపోయింది. కూటమిలో ప్రధాన పార్టీ కాంగ్రెస్ 99 సీట్లు సాధించి లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. పదేళ్ల తర్వాత లోక్ సభలో విపక్ష పదవి ఆ పార్టీకి దక్కింది.

ఈ పదవిని చేపట్టేందుకు కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి సీడబ్ల్యూసీ సమావేశమై రాహుల్ గాంధీ పేరును తీర్మానించింది. లోక్ సభలో విపక్ష పదవి అంటే కేబినేట్ ర్యాంకుతో సమానం. అంతేకాదు సభలో సీట్ల కేటాయంపు, పార్టీలకు కార్యాలయ గదులు ఎంపిక వంటి విషయాలతో పాటు.. పార్లమెంటరీ కమిటీల నియామకంలో విపక్ష నేత ఉండాల్సిందే. ఇక పదేళ్లు పాటు పార్టీకి దూరమైన పదవిని రాహుల్ కష్టించి ఈ ఎన్నికల్లో సాధించగలిగారు. పార్టీలో జవసత్వాలు నింపి 99 సీట్ల వరకు తీసుకెళ్లగలిగారు. బీజేపీని సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయనివ్వకుండా నిలువరించగలిగారు. ఇది రాహుల్ సాధించిన విజయంగా పలువురు అభివర్ణిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: