కేకే సర్వే: ఏపీలో 2019లో చెప్పింది అక్షరాలా జరిగింది.. ఈసారి ఏం చెప్పిందో తెలుసా?

కేకే సర్వే.. ఇదో సర్వే సంస్థ. ఎన్నికలకు ముందు.. నియోజకవర్గాల వారీగా సర్వేలు చేస్తుంది. నాయకులు, పార్టీలు అడిగిన విధంగా మండలం స్థాయి నుంచి నియోజక వర్గం రేంజ్‌లో క్లయింట్ల అవసరాలకు అనుగుణంగా సర్వేలు చేస్తుంది. 2019 ఎన్నికలకు ముందు కేకే.. అప్పుడు ఏడాదిన్నర ముందే ఫీల్డులో తిరిగి ఎప్పటికప్పుడు సర్వే రిపోర్టులు ఇచ్చాడు. కొన్ని యూట్యూబ్‌ ఛానళ్లలో ఫలితాలు చెప్పాడు. గత ఎన్నికల్లో వైసీపీ 140కి పైగా సీట్లలో గెలుస్తుందని ఘంటాపథంగా చెప్పాడు కేకే.. అప్పట్లో ఆ సర్వే ఫలితాలు ఎవరూ పెద్దగా నమ్మలేదు. కానీ ఆయన చెప్పినట్టే జరిగింది.

అయితే.. ఈసారి మాత్రం కేకే సరిగ్గా ఎన్నికలకు ముందే బయటకు వచ్చాడు. సర్వేలు చేస్తున్నానంటూ హడావిడి చేశారు. జిల్లాల వారీగా పర్యటించిన సర్వేలు చేసిన కేకే టీమ్‌ ఈ ఎన్నికల్లో కూటమి కచ్చితంగా గెలవబోతోందని తేల్చి చెప్పేశారు. మొత్తం 175 సీట్లలో కూటమి 71 సీట్లు కచ్చితంగా గెలుస్తుందని.. అదే వైసీపీ కేవలం 33 సీట్లు మాత్రమే కచ్చితంగా గెలుస్తుందని కేకే చెపుతున్నారు. మిగిలిన 71 సీట్లలో హోరాహోరీ పోరు ఉందని.. కేవలం 5వేల మెజారిటీతో ఎవరైనా గెలువచ్చని కేకే అంచనా వేస్తున్నారు. అంటే పోటాపోటీగా ఉన్న 71సీట్లలో ఓ 20 గెలుచుకున్నా కూటమి అధికారంలోకి రావడం ఖాయం అన్నమాట.

అదే వైసీపీ అధికారంలోకి రావాలంటే.. పోటాపోటీగా ఉన్న 71 సీట్లలో 60 గెలవాల్సి ఉంటుంది. అందువల్ల కూటమి విజయఢంకా మోగించడం ఖాయం అని కేకే చెబుతున్నారు.
కేకే సర్వే లెక్కలు ఉమ్మడి జిల్లాలవారీగా ఇలా ఉన్నాయి.


శ్రీకాకుళం జిల్లా: కూటమి పక్కా గెలుపు: 6, వైసీపీ పక్కా గెలుపు: 1, హోరాహోరీ: 3
విజయనగరం జిల్లా: కూటమి పక్కా గెలుపు: 3, వైసీపీ పక్కా గెలుపు: 3, హోరాహోరీ: 3
విశాఖ జిల్లా: కూటమి పక్కా గెలుపు: 6, వైసీపీ పక్కా గెలుపు: 4, హోరాహోరీ: 5


తూర్పు గోదావరి జిల్లా: కూటమి పక్కా గెలుపు: 7, వైసీపీ పక్కా గెలుపు: 3, హోరాహోరీ: 9
పశ్చిమ గోదావరి జిల్లా: కూటమి పక్కా గెలుపు: 9, వైసీపీ పక్కా గెలుపు: 1, హోరాహోరీ: 5
కృష్ణా జిల్లా: కూటమి పక్కా గెలుపు: 7, వైసీపీ పక్కా గెలుపు: 1, హోరాహోరీ: 8
గుంటూరు జిల్లా: కూటమి పక్కా గెలుపు: 8, వైసీపీ పక్కా గెలుపు: 1, హోరాహోరీ: 8


ప్రకాశం జిల్లా: కూటమి పక్కా గెలుపు: 4, వైసీపీ పక్కా గెలుపు: 2, హోరాహోరీ: 6
నెల్లూరు జిల్లా: కూటమి పక్కా గెలుపు: 4, వైసీపీ పక్కా గెలుపు: 2, హోరాహోరీ: 4


కడప జిల్లా: కూటమి పక్కా గెలుపు: 1, వైసీపీ పక్కా గెలుపు: 6, హోరాహోరీ: 3
అనంతపురం జిల్లా: కూటమి పక్కా గెలుపు: 8, వైసీపీ పక్కా గెలుపు: 1, హోరాహోరీ: 5
చిత్తూరు జిల్లా: కూటమి పక్కా గెలుపు: 7, వైసీపీ పక్కా గెలుపు: 2, హోరాహోరీ: 5
కర్నూలు జిల్లా: కూటమి పక్కా గెలుపు: 1, వైసీపీ పక్కా గెలుపు: 6, హోరాహోరీ: 7

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: