బన్నీ కోసం తారక్ అలాంటి పని.. ఇది రా మావ నిజమైన ఫ్రెండ్ షిప్ అంటే..!
ఇప్పుడు ఆ స్నేహాన్ని మరింత స్ట్రాంగ్ చేసే విధంగా వీరు మరో అడుగు ముందుకు వేశారు. ఈ ఇద్దరూ కలిసి ఒక సినిమాకు సంబంధించిన కీలక అంశంలో భాగం అవుతున్నారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. బన్నీ అట్లే దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న విషయం ఇప్పటికే అందరికీ తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం సెట్స్‌పై ఉంది. షూటింగ్ వేగంగా జరుగుతుండగా, ఇంకా సుమారు తొమ్మిది నెలల్లో మొత్తం షూటింగ్ పూర్తయ్యే అవకాశముందని సమాచారం.
ఇక ఈ సినిమాలో బన్నీ క్యారెక్టర్ ఇంట్రడక్షన్‌కు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు అభిమానుల్లో భారీ ఎక్సైట్మెంట్‌ను తీసుకొచ్చింది. అదేంటంటే, బన్నీ క్యారెక్టర్‌కు ఇంట్రడక్షన్ వాయిస్ ఓవర్‌ను తారక్ ఇవ్వబోతున్నారట. తారక్ వాయిస్ ఎంత గంభీరంగా, ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన వాయిస్‌లో వచ్చే ఎనర్జీ, ఎలివేషన్, మాస్ ఫీల్ అన్నీ కూడా అభిమానులకు బాగా తెలిసిన విషయాలే.
అలాంటి తారక్ వాయిస్‌తో బన్నీ క్యారెక్టర్‌కు ఇంట్రడక్షన్ వస్తే అది వేరే లెవెల్‌లో ఉంటుందని జనాలు ఇప్పటికే అనుకుంటున్నారు. ఈ విషయంపై చాలా రోజుల నుంచే ఇండస్ట్రీలోనూ, సోషల్ మీడియాలోనూ డిస్కషన్స్ నడుస్తూనే ఉన్నాయి. ఫైనల్లీ ఇప్పుడు దీనికి ఓకే వచ్చినట్టు సమాచారం బయటకు వచ్చింది. త్వరలోనే దీనిపై అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా రాబోతుందని టాక్.ఇక మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఏప్రిల్ 8వ తేదీ బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఒక స్పెషల్ టీజర్‌ను రిలీజ్ చేయాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఆ టీజర్‌లో కూడా తారక్ వాయిస్‌ను జాయిన్ చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అదే నిజమైతే, బన్నీ స్క్రీన్ ప్రెజెన్స్‌కు తారక్ వాయిస్ కలిస్తే థియేటర్లలో అభిమానుల రచ్చ ఎలా ఉంటుందో ఊహించుకోవడమే కష్టం.
ఇది నిజమైన ఫ్రెండ్షిప్ అంటే ఇదే అంటూ అభిమానులు ఫుల్‌గా ఎమోషనల్ అవుతున్నారు. బన్నీ కటౌట్‌కు తారక్ వాయిస్ అనే కాంబినేషన్ గురించి ప్రతి సంవత్సరం సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కలలు కంటూనే ఉంటారు. ఇప్పుడు ఆ కల నిజమవుతుందేమో అన్న ఆశతో వాళ్ల ఎక్సైట్మెంట్ డబుల్ అవుతోంది.సోషల్ మీడియాలో ఇప్పటికే ఫ్యాన్ యూనియన్స్ ఈ టాపిక్‌ను బాగా ట్రెండ్ చేస్తున్నారు.