మోదీ కామెంట్లతో ఆ వైసీపీ మంత్రి రేంజ్‌ అమాంతం పెరిగిందిగా?

ప్రధాని మోదీ వ్యాఖ్యలతో వైసీపీ నేతలు భయపడుతున్నారు. డైలమలో పడిపోతున్నారు. ప్రధాని మోదీ వచ్చి వైసీపీ సర్కారుతో పాటు మంత్రుల అవినీతి గురించి మాట్లాడుతున్నారు. కానీ వైసీపీ నుంచి రియాక్షన్ రావడం లేదు. తాజాగా ప్రధాని రాయలసీమ పర్యటనకు విచ్చేశారు. రాజంపేట కూటమి అభ్యర్థిగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు.

ఆయనకు మద్దతుగా పీలేరులో ఏర్పాటు చేసిన సభలో మోదీ మాట్లాడారు. వైసీపీ పేదల కోసం పనిచేయడం లేదని మాఫియా వికాసం కోసం పనిచేస్తోందని హాట్ కామెంట్స్ చేశారు. ఏపీలో కూటమి అధికారంలోకి రావాలని పదే పదే చెబుతున్నారు. స్థానికంగా రౌడీ రాజ్యం నడుస్తోందని పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డిని ఉద్దేశించి అన్నట్లే అర్థం అవుతోంది. అయితే ప్రధాని మోదీ పెద్ది రెడ్డి రౌడీయిజం గురించి మాట్లాడటం తీవ్ర చర్చనీయాంశం అవుతుంది.

వాస్తవంగా పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి స్థానికంగా బలమైన నేత. సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడు కూడా. అందుకే రెండు సార్లు తన మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. అయితే గత ఎన్నికల్లో ఆయన కొద్ది తేడాతోనే విజయం సాధించారు. టీడీపీ, జనసేన, బీజేపీ విడివిడిగా పోటీ చేయడంతో ఓట్ల చీలిక ఆయనకు  కలిసి వచ్చింది. ఈ సారి మూడు పార్టీలు కలసి రావడం, ప్రధాని మోదీ మంత్రి అరాచకాలు చేస్తున్నారు అని విమర్శించడం సంచలనంగా మారాయి.
అయితే పెద్ది రెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.

అయితే ఇటీవల రామచంద్రయాదవ్ అక్కడ ప్రచారానికి వెళ్లిన సమయంలో వైసీపీ నాయకులు దాడులు చేయడం.. ఆ తర్వాత డీఎస్పీ, డీఐజీ, ఇతర పోలీస్ అధికారులు బదిలీ కావడం వంటివి పెద్దిరెడ్డికి ఇబ్బందికరంగా మారాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఓ మంత్రి రౌడీ రాజ్యం చేస్తున్నారు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరి నరేంద్ర మోదీ వ్యాఖ్యలు స్థానిక ప్రజలపై ఎంత మేర ప్రభావం చూపుతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: