జగన్‌, బాబు, పవన్‌: ముగ్గురూ ఆలోచించండి.. ఇది ఏపీకి ఏమాత్రం మంచిది కాదు!

ఏపీలో రాళ్ల రాజకీయం నడుస్తోంది. సీరియస్ గా మొదలైన ఈ అంశం ఏపీపై ప్రభావం చూపుతోంది. ముందు సీఎం జగన్.. ఆ తర్వాత తెనాలిలో పవన్ కల్యాణ్ పై, సాయంత్రం విశాఖ జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబుపై ఎవరో అగంతకులు రాళ్లు విసిరారు. ఇలా ఒక్కరోజు తేడాలో ముగ్గురు పార్టీ అధినేతలపై రాళ్ల దాడులు జరిగాయి అన్న వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి.

అసలు ఏపీలోనే ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఇక్కడ రాజకీయాల్లో ప్రత్యర్థులుగా ఎవరూ మరొకరని చూడటం లేదు. శత్రువుల కంటే దారుణంగా చూస్తున్నారు. ఒకరిపై ఒకరు కోపం పెంచుకొని మాట్లాడుతున్నారు. పాతాళానికి తొక్కేస్తాం అని ఓ నేత అంటారు. చెప్పు తీసి కొడతాను అని మరో నేత. వెంట పడీ మరీ కొడతామని.. ఇంట్లోకి వచ్చి కొడతామని మరి కొందరు రాజకీయ నేతలు అంటుంటారు. దీని వల్ల అమాయక క్యాడర్ కు ఏమి తెలుసు. వారి కి ఉన్న కసినంతా క్యాడర్ మెదళ్లలోకి ఎక్కిస్తున్నారు. గతంలో ఇక నాయకుడు మాట్టాడితే ఆయన ప్రసంగం మొత్తం విధివిధానాల మీదే ఉండేది.

మీ పాలనలో ఈ పని చేయలేదు. మీరు ఈ మాట తప్పారు అంటూ సున్నితంగా విమర్శలు చేసుకునేవారు. అందులో ఛలోక్తులు ఉండేవి. ఇప్పుడు రాజకీయాల మీద అవగాహన లేని నాయకులు కూడా నేతల రూపంలో వేదికలు ఎక్కేస్తునారు. చేతికి మైక్ అందితే చాలు. ప్రత్యర్థులను నోటికి వచ్చినట్లు తిట్టేస్తున్నారు.

ప్రజాస్వామ్యంలో వాడని భాషని.. వాడుతూ కసిని పెంచి పోషిస్తున్నారు. దాంతో అవతలి పక్షం నాయకులు కనపడితే చాలు శత్రువులాగా ఫీల్ అవుతున్నారు. దీంతో రాజకీయ నేతలు మాట్లాడే భాషలకు మారిపోయి దాడులకు తెగబడుతున్నారు. ఒకరిపై ఒకరు దూషణలకు దిగుతూ కార్యకర్తల మధ్య యుద్ధానికి ప్రేపిస్తున్నారు. ఇవి ఇలానే కొనసాగితే రాళ్ల దాడే కాదు. పెద్ద పెద్ద ప్రమాదాలు చోటుచేసుకుంటాయి అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి, ఏపీకి మంచిది కాదని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: